స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో ఆంధ్రప్రదేశ్ ఐదు నగరాలు గార్బేజ్ ఫ్రీ సిటీ (GFC) సెవెన్ స్టార్ అందుకున్న విజయవాడ

5
0

విజయవాడ నగరపాలక సంస్థ
17-07-2025

స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో ఆంధ్రప్రదేశ్ ఐదు నగరాలు

గార్బేజ్ ఫ్రీ సిటీ (GFC) సెవెన్ స్టార్ అందుకున్న విజయవాడ

న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో, గురువారం ఉదయం స్వచ్ఛ సర్వేక్షన్ 2024 పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛత లీగ్ పురస్కారాన్ని భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ, విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర హేచ్ ఎం అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న జాబితాలో విజయవాడ నగరపాలక సంస్థ, ఇండోర్, సూరత్, నవీ ముంబై తర్వాత చేరుకోవటం ఇదే మొదటి సారి అని, విజయవాడకు మరో పురస్కారం గార్బేజ్ ఫ్రీ సిటీ కేటగిరీలో సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చిందని, 3 లక్షల నుండి 10 లక్షల జనాభా గుంటూరు, 50 వేల నుండి మూడు లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి ఈ పురస్కారాలను అందుకున్నాయని అన్నారు. స్పెషల్ కేటగిరీలో జీవీఎంసీ, మినిస్టరియల్ అవార్డు క్యాటగిరిలో రాజమండ్రి అవార్డు అందుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఐదు నగరాలకు అత్యుత్తమ పురస్కారమైన స్వచ్ఛ సర్వేక్షన్ పురస్కారం రావటం ఎంతో గర్వకారణం అని అన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2021 తర్వాత మళ్లీ 2024లో భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది మురము చేతుల మీదుగా అవార్డు అందుకోవటం ఇది రెండవసారి అని, ఇప్పటివరకు విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షన్ ఉత్తమ స్థానాలలోనే నిలుస్తున్నందున సూపర్ స్వచ్ఛత లీగ్ పురస్కారం దక్కిందని. దీనికి ముఖ్యకారమైన ప్రజలు, పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నగర కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ సూపర్ స్వచ్ఛత లీగ్ లో స్థానం దక్కించుకోవాలి అంటే గత మూడు సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా ప్రథమ మూడు స్థానాలలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు గెలిచి ఉండాలని, 2024 సంవత్సరం వరకు మొదటి 20 స్థానాలలో నగరం ఉండాలని, ఈ నిబంధనలకు అనుగుణంగా విజయవాడ నవరపాలక సంస్థకు అర్హతలు ఉన్నందున సూపర్ స్వచ్ఛత లీగ్ లో అత్యుత్తమ స్థానాలలో ఉన్న ఇండోర్, సూరత్, నవీ ముంబై తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ కూడా స్థానం దక్కించుకుందని అన్నారు. ఈ పురస్కారం తనకు దక్కినప్పటికీ గత మూడు సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థను ఉత్తమ స్థానాలలో నిలిపిన కమిషనర్లు ప్రసన్న వెంకటేష్, స్వప్నల్ దినకర్ పుండ్కర్ పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపారు. ఇప్పటికీ విజయవాడ నగరానికి వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఉందని, స్వచ్ఛ సర్వేక్షన్ 2024 లో భాగంగా గారబేజ్ ఫ్రీ సిటీ లో సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చిందని తెలిపారు.

2024 బుడమేరు వరదలతో తీవ్ర విపత్తు సందర్భాన్ని ఎదుర్కొన్న విజయవాడ నగరపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి త్వరగా కోలుకుందని, ముఖ్యమంత్రి కలెక్టరేట్లోనే 15 రోజులు ఉంటూ విజయవాడ నగర కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ దీనికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ, విపత్తు సమయంలో రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల నుండి 32 సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, 200 అధికారులను, 10,000 పారిశుద్ధ్య కార్మికులతో విజయవాడ నగరంలో పారిశుధ్య నిర్వహణకై ప్రత్యేక శ్రద్ధ వహించడం, సూపర్ స్వచ్ఛత లీగ్ లో పురస్కారం అందుకోవటంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ముఖ్యంగా ఎం ఎ యు డి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్, డాక్టర్ పి. సంపత్ కుమార్, స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండి వి. అనిల్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా 2024లో స్వచ్ఛ సర్వేక్షన్ లో సహకరించిన ప్రజలు, ఎన్జీవోలు, రెసిడెన్ వెల్ఫేర్ సొసైటీలు, సిబ్బంది అధికారులు, మీడియా మిత్రులు, విజయవాడ నగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ డిలీగేషన్ లో భాగంగా అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎస్ ఈ ప్రాజెక్ట్స్ పి సత్యకుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ రజియా షబినా, సానిటరీ సూపర్వైజర్ శివ రాంప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ బి ఏ ప్రసాద్, సానిటరీ వర్కర్స్ శామ్యూల్, ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబెర్ రామారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here