స్పెషల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఎ మహేష్ పరిశీలన

Spread the love

స్పెషల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఎ మహేష్ పరిశీలన

 ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన ఆదేశాల మేరకు ప్రతి బుధవారం స్పెషల్ ఆఫీసర్లకు కేటాయించిన నియోజకవర్గం లో పర్యటించి అక్కడున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్ బుధవారం నాడు జోనల్ కమిషనర్ వన్ రమ్య కీర్తన తో కలిసి పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న 225, 226 సచివాలయాలు, శ్రీ వెలగపూడి లక్ష్మణ దత్తు ఎలిమెంటరీ పాఠశాల, బాప్టిస్ట్ పాలెం యు పి హెచ్ సి, కేదరాశ్వర్ పేట లోని అంగన్వాడి కేంద్రాలు, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

 ముందుగా 225, 226 సచివాలయాలు పర్యటించి సచివాలయంలో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, పరిశీలించారు సచివాలయం సిబ్బందితో మాట్లాడి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహణ, త్రాగునీటి పరీక్షలు గురించి కచ్చితంగా చేయాలని తెలిపారు. తదుపరి శ్రీ వెలగపూడి లక్ష్మణ దత్తు ఎలిమెంటరీ స్కూల్ లో పర్యటించి పిల్లలతో మాట్లాడి వారిని గణితంలో ప్రశ్నలు అడిగారు, స్కూల్లో ఉన్న మరుగుదొడ్లను, స్కూల్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. 

 తదుపరి కేదారేశ్వరపేట-2, కేదారేశ్వరపేట-3, లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పర్యటించి అక్కడ పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం, దినదిన మెనూ పరిశీలించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పర్యటించి జరుగుతున్న ఇమ్యునైజేషన్, ప్రతిరోజు ఎంతమంది ఓపి కీ వస్తున్నారు, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ని ఇస్తున్నారు అని పరిశీలించారు. చివరగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులతో మాట్లాడారు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు, ఇచ్చే ఆహారంలో నాణ్యత మరుగుదొడ్లలో పరిశుభ్రత ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. వార్డెన్ రూమ్ లో ఉన్న రిజిస్టర్ లను చూశారు, మూమెంట్ రిజిస్టర్ కచ్చితంగా పాటించాలని, ప్రతి విద్యార్థి ఇన్ అండ్ అవుట్ కచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *