సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు

0

ది 30/05/2025 శుక్రవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశేష అవసరాలను సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఇకనుండి ప్రతినెలా ఒకటి నుండి 15 తారీకు వరకు చౌక ధరల దుకాణాల ద్వారా షాపుల ద్వారా బియ్యం మాత్రమే కాకుండా సబ్సిడీ ధరలతో విడతల వారీగా అన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని తెలియజేశారు. కానీ దివ్యాంగులకు 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఇంటికే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తామని స్పష్టం చేశారు.ఈపాస్ మిషన్లను ఈ కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసి ప్రజలకు సప్పరం అసౌకర్యం కలగకుండా సరుకులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇకనుండి ప్రజలందరూ పనులు మానుకొని ఎండనక వాననక ఎన్ డి యు వాహనాలను కోసం ఎదురుచూసే అవసరం లేదని ఒకటి నుండి 15వ తారీకు లోపు వారికి నచ్చిన తేదీలో చౌక ధరల దుకాణం తాలూకు సమయాన్ని అనుసరించి ఎప్పుడైనా సరుకులను తీసుకునే సౌలుభ్యన్ని కలగజేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు అమలు చేస్తున్న మొబైల్ డిస్పెన్స్ యూనిట్ల సాఫ్ట్వేర్ను తొలగించి రేషన్ డీలర్ల దగ్గరున్న షాపులలోని ఈ పోస్ట్ మిషన్లలోకి సాఫ్ట్వేర్ ని అప్లోడ్ చేసి వారి వద్ద ఉన్న ఈ పోస్ట్ మిషన్లలోకి కార్డు నెంబర్ను ఎంటర్ చేసి వేలిముద్ర వేసిన వెంటనే సరుకులు తీసుకునేలా అత్యంత ఆధునికమైన సాఫ్ట్వేర్ తో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ పోస్ట్ మిషన్లను అందిస్తామని తెలియజేశారు. నడవలేని వారు, దివ్యాంగులకు మరియు 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ప్రతినెల 5వ తారీఖు లోపే వారి ఇంటికి సరుకులు అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఇల్లు మారిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు మొబైల్ పోర్టబిలిటీ విధానములో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టనున్నామని తెలియజేశారు. డీలర్ పేరు షాపు నెంబరు వార్డు నెంబరు సరుకులు నిల్వ చేసే బోర్డులను విధిగా షాపుల యందు ప్రదర్శించి అత్యంత పారదర్శకత్వంగా ఉండే విధంగా డీలర్లు మెలిగేలా విధానాలను రూపొందించామని తెలిపారు. డీలర్ల ఆర్గనైజేషన్ సర్టిఫికెట్లతో పాటు తూనికలు కొలతల శాఖ స్టాంపింగ్ రసీదులను తప్పనిసరిగా రేషన్ షాపుల్లో ఉంచాలని అధికారులు నిరంతరం మెగా కొనసాగించాలని సూచించామని తెలియజేశారు. ఈనెల ఒకటో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చౌక ధరల దుకాణంలో సరుకుల పంపిణీని ప్రారంభిస్తున్నామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 61వ డివిజన్లోని 104 నంబరు డిపో నందు తాను కూటమినేతలతో కలిసి ప్రారంభించనున్నామని తెలిపారు. ఇకనుండి ప్రజలు గంటల తరబడి లైన్లో నుంచుని సరుకులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఒకటి నుంచి 15వ తారీకు లోపల వారికి నచ్చిన తారీకు లో సరుకులు తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని పక్కా కొలతలతో రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నామని అలాగే త్వరలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో అత్యంత ఆధునికమైన స్మార్ట్ కార్డులను ప్రవేశపెడితే పెట్టనున్నామని తెలియజేశారు. ప్రజలకు ఏది సౌకర్యంగా ఉంటుందో అది అమలుపరిచేలా చేయటమే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పది నెలల కాలంలో అనేక కోణాలలో పరిశీలించి ప్రజలకు సౌకర్యం, సరుకుల నాణ్యత, సరి అయిన తూకం తో రేషన్ షాపుల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని భావించి నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. అనేకమంది ప్రజలు తమకు ఫిర్యాదులు చేశారని తాము ఒకరోజు పని మానుకొని రేషన్ సరుకుల కోసం ఎదురు చూడవలసి వస్తుందని, క్యూలైన్లో గంటలు తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉందని అనటంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణ మోహన్ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version