సెంట్రల్లో ముగ్గురు రౌడీషీటర్లు మనకు అవసరమా- ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

0

 సెంట్రల్లో ముగ్గురు రౌడీషీటర్లు మనకు అవసరమా- ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

బోండా ఉమా పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టిడిపి నేత బోండా ఉమాకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని, ప్రజలకు ఏమి మంచి చేశారని బోండా ఉమా కి ఓటు వేస్తారని సూటిగా ప్రశ్నించారు. తండ్రి బాటలోనే కొడుకులు కూడా నియోజకవర్గంలో నీచంగా వ్యవహరిస్తున్నారని, బోండా ఉమా తన కుమారులను రోడ్డుమీద గాలికి వదిలేసిన దుర్మార్గుడుని విమర్శించారు. ఈ ముగ్గురు రౌడీలు సెంట్రల్ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. బోండా ఉమా దౌర్జన్యాలకు హద్దు అదుపు లేదని, మొదట్నుండి బోండా ఉమా రౌడీలా ప్రవర్తిస్తారని గూండాయిజం, రౌడీయిజం భూకబ్జాలకు క్యారాఫ్ అడ్రస్ బోండా ఉమా అన్నారు. ఈ నేపథ్యంలోని 13వ తారీఖున ప్రజలు బోండా ఉమాను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కేసినేని నాని చెప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురం 30 వ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి వివరించారు. అనంతరం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఈ సందర్భంగా ఇరువురు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, కోఆర్డినేటర్ దుర్గారావు, కృష్ణ, వర్మ, సుబ్బారెడ్డి, లక్ష్మి, సీతా, కరీం పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version