సుజనా రోడ్ షోకు బ్రహ్మరథం

0

 సుజనా రోడ్ షోకు బ్రహ్మరథం

తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం, అలాగే ఎస్సీ, ఎస్టీలకు చర్చిల నిర్మాణం చేస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని సుజనా దుయ్యబట్టారు.  కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. ఇది ధర్మం-అధర్మం మధ్య జరుగుతోన్న యుద్ధమని అభివర్ణించారు. వైసీపీ పాలనలో అంతా విధ్వంసమేనన్నారు. ఏపీలో, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, తాము గెలిచాక 22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున సుజనా రోడ్ షో చేస్తున్నారు. సుజనా రోడ్ షోకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. దారిపొడవునా సుజనాకు మద్దతుగా అభిమానులు నినాదాలు చేశారు. సుజనా రోడ్ షోలో టీడీపీ లోక్ సభ అభ్యర్థి కేశినేని శివనాథ్, వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ జాతీయ నాయకుడు షానవాజ్ హుస్సేన్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్, టీడీపీ మైనారిటీ నేత నాగుల్ మీరా,  బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version