సీఎం సహాయనిది పేదలకు వరం : యార్లగడ్డ
గన్నవరం :
ముఖ్యమంత్రి సహాయనిది పేదరోగుల పాలిట వరంగా మారిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ఇరువురు రోగులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధినుండి మంజూరు చేయించిన ఎల్ఓసి లను ఆయన అందజేశారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉంగుటూరుకు చెందిన అంబటి రంగారావుకు రూ.70 వేలు, గన్నవరంవాసి నాగసూరి లక్ష్మీ నాంచారయ్యకు రూ.2.75 లక్షల ఎల్ఓసిలను రోగుల కుటుంబ సభ్యులకు వెంకట్రావు అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ పేద రోగులకు సత్వర, కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం సహాయానిధి ద్వారా నిధులు మంజూరు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.