సీఎం చంద్రబాబు కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీం

4
0

చంద్రబాబు కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీం 

సీఎం చంద్రబాబు పై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు న్యాయవాది బి. బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. 

ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? అని సీనియర్ న్యాయవాది మణీంద్రసింగ్ పై ధర్మాసనం ఆగ్రహం.

ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here