సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

1
0

సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నందివాడ మండలంలో ‘సూపరి పాలనలో తొలి అడుగు’…. ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే రాము

శంకరం పాడు గ్రామంలో ఎమ్మెల్యే రాముకు ఘన స్వాగతం పలికిన… ప్రజలు

నందివాడ జులై 03: ఆర్థిక సమస్యలు తలెత్తిన… సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

నందివాడ మండలం శంకరపాడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు.

ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే రాము….ప్రతి ఒక్కరితో మమేకమవుతూ,ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే రాము, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అని అడిగి తెలుసుకున్నారు.

ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి అంశాలను, రాబోవు రోజుల్లో చెయ్యబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రాము ప్రజలకు వివరించారు.

ముందుగా గ్రామంలోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము…. మరియ మాత స్వరూపానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం చేసిన మంచి పనులను వివరించే కరపత్రాలను ఎమ్మెల్యే రాము ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా. ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… హామీలను అమలు చేస్తూ సాగుతున్న సీఎం చంద్రబాబు సుపరిపాలనలో….. పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పలు సంక్షేమ పథకాలను అమలు చేసే ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు దక్కిందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

టిడిపి నాయకులు ఉప్పల వెంకటేశ్వరరావు, ఆరెకపూడి రామశాస్త్రులు, కుర్మా శీను…అందుగుల ఏసుపాదం శంకరం పాడు గ్రామ టిడిపి నాయకులు బట్టు రవి కిషోర్,
పందుల రాజారావు, ప్రదీప్ కుమార్, కంభం రమేష్, ఆర్ దావీదు, బట్టు ఆనందబాబు, బట్టు వెంకయ్య, పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే రాముతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here