సెప్టెంబర్ 25, 2025
*సామాన్య భక్తులకు పెద్దపీట… నినాదాన్ని నిజం నిజం చేసి చూపించిన ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీ షా
*క్యూ లైన్ లో వెళ్లి బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దంపతులు
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి.. వారికి సత్వర దర్శన భాగ్యం కల్పించాలని శ్రీయుత కలెక్టర్ దంపతులు ఈరోజు రాత్రి 9 15 గంటలకు వీఐపీ టైం స్లాట్ ముగిసిన తరువాత క్యూ లైన్ ద్వారా బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నానని అన్నారు. శ్రీ కాత్యాయనీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన జగన్మాతను గురువారం సుమారు రాత్రి 9 గంటల తరువాత ఆయన దర్శించుకున్నారు. వీఐపీ దర్శనాలకు దేవస్థానం కేటాయించిన సమయాలలో మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు. సామాన్య భక్తుడిని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు గర్భగుడిని కాకుండా బంగారు వాకిలి దర్శనం చేసుకుని ఆలోచనతో వచ్చినట్లయితే సామాన్య భక్తులకి మెరుగైన దర్శన సౌకర్యం కల్పించిన వారుగా నిలుస్తామని ఉదాహరణగా వారు కూడా చేసి చూపించినారు. కావున మిగిలిన రోజులలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయవలసిందిగా శ్రీయుత కలెక్టర్ వారు ఆలయ అధికారులకు సూచనలు ఇవ్వడం అయినది.
![]()
