
సమన్వయంతో పని చేస్తా 36 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్..
డివిజన్ అభివృద్ధికి అందరి సమన్వయంతో పనిచేస్తానని 36 వ డివిజన్ కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్ అన్నారు.
కార్పొరేటర్ గా గెలుపొందిన ఆయన బుధవారం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రత్తిపాటి శ్రీధర్ శరత్ ను అభినందించి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్ మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బీజేపీ టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
డివిజన్ పరిధిలోని సమస్యలను ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
కూటమి నేతలతో కలిసి కట్టుగా పనిచేస్తానని కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్ తెలిపారు..
![]()
