శ్రీ సరస్వతీ దేవి అమ్మవారికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు పట్టు వస్త్రాలు సమర్పించారు

Spread the love

 9-10-2024

సత్యనారాయణపురం

మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి అమ్మవారికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు పట్టు వస్త్రాలు సమర్పించారు

ధి:-9-10-2024 ఈరోజు బుధవారం ఉదయం సత్యనారాయణ పురం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు కన్యకామేశ్వరి ఆలయం నందు దసరా నవరాత్రులలో భాగంగా “మూలా నక్షత్రం”సందర్భంగా శ్రీ సరస్వతి దేవి” గా దర్శనమిచ్చిన అమ్మవారికి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని పట్టు వస్త్రాలను అందజేసి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ:-ఏడో రోజు, శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అని అమ్మవారికి నైవేద్యంగా దధ్యోదనం నివేదిస్తారు

సరస్వతి దేవి హిందూ మతంలో జ్ఞానం, సంగీతం, కళలు మరియు సృజనాత్మకతకు అధిదేవత అని వేదాలలో, పురాణాలలో మరియు ఉపనిషత్తులలో సరస్వతి దేవిని విస్తృతంగా ప్రస్తావిస్థారు అమ్మవారికి వాక్‌దేవి,వేదమాత గా పూజలు చేస్తారని

సరస్వతి దేవిని జ్ఞానం మరియు విద్యకు అధిదేవతగా భావిస్తారు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు ఆమెను ఆరాధిస్తారు,సంగీతం మరియు కళలు  సరస్వతి దేవిని సంగీతం, కళలు మరియు సృజనాత్మకతకు అధిదేవతగా కూడా భావిస్తారు అని కళాకారులు, సంగీతకారులు అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారని…

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కూటమి ప్రభుత్వం లో ప్రజలు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ఆరాధించడం జరిగినదని బొండా ఉమ తెలియజేశారు…

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *