శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
12 జూలై 2025
శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పణ కు రెండు తెలుగు రాష్ట్రాలనునుండి వేలాది మంది ఇంద్రకీలాద్రికి తరలి రావడంతో దుర్గా క్షేత్రం కిట కిట లాడింది.
తెల్లవారు జాము నుండే భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా పర్యవేక్షించి, సిబ్బందికి సూచనలు చేశారు.ప్రత్యేక విధులు కేటాయించిన దేవస్థానం సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించారు.
విపరీతంగా పెరిగిన భక్తులరద్దీ అనుసరించి 500/- అంతరాలయ దర్శనం రద్దు చేసి సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించారు.
ఆషాఢ సారె సమర్పణనిమిత్తం విచ్చేసిన బృందాలు కోసం ఎప్పటికప్పుడు క్యూలైన్లు పరిశీలన చేసి ప్రత్యామ్యాయమార్గాలు ఏర్పాటు చేశారు.పాత మెట్లు, మహా మండపం మెట్లు, లిఫ్ట్ మార్గం, ఘాట్ రోడ్ గుండా భక్తులు కొండ పైకి చేరుకున్నారు.
ఉత్తరాంధ్ర భవానీ దీక్షా సేవా పీఠం అధ్యక్షులు పులపా మల్లేశ్వరావు గురుభవాని ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల నుండి సుమారు 1000మందికి పైగా భక్తులు ఆషాఢ సారె సమర్పణ కు వన్ టౌన్ వినాయక టెంపుల్ నుండి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.
మహ మండపం 6వ అంతస్తులో సారె సమర్పణ బృందాలకు ఆశీర్వచనం, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడమైనది.
ప్రధాన ఆర్జిత సేవలైన చండీ హోమం, లక్ష కుంకుమార్చన తదితర పూజలలో భక్తులు పాల్గొన్నారు.
ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం భక్తులకు అందేలా ఆలయసిబ్బంది చర్యలు తీసుకున్నారు.