మురళీమోహన్ .. క్రమశిక్షణ కలిగిన నటుడు. హీరోగా అనేక సినిమాలలో నటించిన ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా అనేక సినిమాలు చేశారు. ‘ఐ డ్రీమ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ, శ్రీదేవిని గురించి ప్రస్తావించారు. ” చాలామంది హీరోయిన్ గా శ్రీదేవి ఫస్టు సినిమా ‘పదహారేళ్ల వయసు’ అనీ, తొలిసారిగా చంద్రమోహన్ జోడీగా చేసిందని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె ఫస్టు సినిమా చేసింది నాతో” అని అన్నారు.
” హీరోయిన్ గా శ్రీదేవి చేసిన మొదటి సినిమా ‘బంగారక్క’ .. ఆ సినిమాలో హీరో నేనే. సంగీతం మాస్టారుగా నేను .. స్టూడెంట్ గా తాను చేశాము. ఆ సినిమా సమయంలో నన్ను శ్రీదేవి వాళ్ల అమ్మగారు చూశారు. కుర్రాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు .. చేతిలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి .. మా శ్రీదేవిని ఇచ్చి చేస్తే బాగుంటుందేమో’ అని నాకు తెలిసిన ఆవిడతో అన్నారట.
‘అయ్యో ఆయనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది .. ఇద్దరు పిల్లలు కూడా’ అని నాకు తెలిసిన ఆవిడ చెప్పినా, శ్రీదేవి వాళ్ల అమ్మగారు నమ్మలేదట. ‘అయితే చూద్దురుగాని రండి’ అని ఆమె శ్రీదేవి వాళ్ల అమ్మగారిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకుని వచ్చారు. మా ఆవిడను .. మా ఇద్దరి పిల్లలను చూసిన తరువాత ఆమె నమ్మడం జరిగింది” అని చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఒకటి రెండు జరిగినా మా ఆవిడ లైట్ గానే తీసుకునేది” అని అన్నారు.
Spread the love _బాబుది బూటకపు మేనిఫెస్టో. ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదు.అబద్ధపు హామీలీవ్వడంలో బాబు దిట్ట.. జగనన్న చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు బూటకపు మేనిఫెస్టోను ప్రపంచ […]
Spread the loveరహదారి భద్రతతోనే స్వర్ణాంధ్ర కల సాకారం. 2026 లో రోడ్డు ప్రమాద మరణాలను బాగా తగ్గించాలి. 2024 తో పోలిస్తే 2025లో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయని జిల్లా […]
Spread the love“రైజ్” ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తల ఆలోచనలకు కార్యరూపం.. మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ద్వారా కార్యరూపం ఇస్తున్నామని.. జిల్లాలో 5 వేల […]