మురళీమోహన్ .. క్రమశిక్షణ కలిగిన నటుడు. హీరోగా అనేక సినిమాలలో నటించిన ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా అనేక సినిమాలు చేశారు. ‘ఐ డ్రీమ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ, శ్రీదేవిని గురించి ప్రస్తావించారు. ” చాలామంది హీరోయిన్ గా శ్రీదేవి ఫస్టు సినిమా ‘పదహారేళ్ల వయసు’ అనీ, తొలిసారిగా చంద్రమోహన్ జోడీగా చేసిందని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె ఫస్టు సినిమా చేసింది నాతో” అని అన్నారు.
” హీరోయిన్ గా శ్రీదేవి చేసిన మొదటి సినిమా ‘బంగారక్క’ .. ఆ సినిమాలో హీరో నేనే. సంగీతం మాస్టారుగా నేను .. స్టూడెంట్ గా తాను చేశాము. ఆ సినిమా సమయంలో నన్ను శ్రీదేవి వాళ్ల అమ్మగారు చూశారు. కుర్రాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు .. చేతిలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి .. మా శ్రీదేవిని ఇచ్చి చేస్తే బాగుంటుందేమో’ అని నాకు తెలిసిన ఆవిడతో అన్నారట.
‘అయ్యో ఆయనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది .. ఇద్దరు పిల్లలు కూడా’ అని నాకు తెలిసిన ఆవిడ చెప్పినా, శ్రీదేవి వాళ్ల అమ్మగారు నమ్మలేదట. ‘అయితే చూద్దురుగాని రండి’ అని ఆమె శ్రీదేవి వాళ్ల అమ్మగారిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకుని వచ్చారు. మా ఆవిడను .. మా ఇద్దరి పిల్లలను చూసిన తరువాత ఆమె నమ్మడం జరిగింది” అని చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఒకటి రెండు జరిగినా మా ఆవిడ లైట్ గానే తీసుకునేది” అని అన్నారు.
Spread the love అమరావతి బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి: ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఇవాళ ఉద్యోగ విరమణ […]
Spread the loveలోక కళ్యాణం కోసం సత్యసాయి పని చేశారు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి సిద్దాంతానికి అంబాసిడర్లుగా బాబా భక్తులు మారాలి : సీఎం చంద్రబాబు మహాసమాధి దర్శనం అనంతరం బాబా […]
Spread the love వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి టిడిపి పార్టీకి చెందిన నాయకులు కూడా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించామని వెల్లంపల్లి […]