వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టికెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే (చెన్నకేశవరెడ్డి)కి మధ్య డబ్బు పోటీ పెట్టారని ఆరోపించారు.
అయితే, నా వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌరవంగా తప్పుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. మరి ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఎంత సమర్పించారో తనకు తెలియదని అన్నారు.
బీసీలకు బీసీలకు మధ్య, ఎస్సీలకు ఎస్సీలకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సంజీవ్ కుమార్ విమర్శించారు. గొడవలు సృష్టించే విచ్ఛిన్నకర రాజకీయాలు వైసీపీలో చూశానని వెల్లడించారు.
Spread the love *ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 21, 2024* ముంపు నష్టం నమోదుకు మరో అవకాశం సచివాలయాల్లో నష్ట గణన జాబితాల ప్రదర్శన – ఇంకా ఎవరైనా మిగిలిఉంటే ఆది, సోమవారాల్లో నమోదు. – […]
Spread the love టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్, భారతి సిమెంట్స్, వైఎస్ భారతిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పేదవాడినని ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని […]
Spread the love రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం […]