16-07-2025
వైసిపి ఎమ్మెల్యే జగన్ కు హత్య రాజకీయాలు అలవాటు
జగన్ అంటే ఒక విధ్వంసం , వినాశనమంటూ మండిపడ్డ ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ : వైసిపి జగన్ తన పాలనలో ఎనాడు ప్రజల అభివృద్ది గురించి సంక్షేమం గురించి పట్టించుకోలేదు. అభివృద్ది, సంక్షేమం ధ్యేయంగా ముందువెళ్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసిపి ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ రెడ్డి విమర్శలు చేయటం విడ్డూరంగా వుందంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో వైసిపి ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై మండిపడ్డారు.
ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా వున్నారని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజలు ఎన్డీయే కూటమి పాలనపై వారి ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తన ఉనికి కోసం ఐదు రోజులకొకసారి ప్రెస్ మీట్ పెట్టడం అలవాటు మారిందని ఎద్దేవా చేశారు.
గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లను ప్రోత్సహిస్తూ, క్రికెట్ బెట్టింగ్ ఆడి చనిపోయిన వ్యక్తులను పరామర్శించటానికి వెళుతున్న జగన్ ను ప్రజలు ఛీ కొట్టడానికి రెడీ వున్నారన్నారు. జగన్ అంటే ఒక విధ్వంసం , వినాశనం అని ప్రజలకి బాగా అర్దమైందని, అందుకే జగన్ రెడ్డి జీవితంలో అధికారంలోకి రాకూడదనే 11 సీట్లతో తీర్పు ఇచ్చారన్నారు.. ఈ సారి జగన్ కి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ది చెప్పటానికి రెడీగా వున్నారని తెలిపారు. ఎమ్మెల్యే జగన్ కు హత్య రాజకీయాలు చేయటం బాగా అలవాటని, అందుకే హింసను ప్రేరేపించే విధంగా వైసిపి నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నాడన్నారు. ఇటీవల మామిడి రైతుల పరామర్శ అంటూ మామిడికాయలను ట్రాక్టర్స్ తో తొక్కించి రైతులను అవమానపర్చాడన్నారు. .జగన్ ఏ పరామర్శకు వెళ్లిన దౌర్జన్యం, విధ్వంసం కార్యక్రమాలే చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లకే పరిమితం అయిన ఎమ్మెల్యే జగన్ కు ప్రజలు బుద్ది చెప్పటానికి సిద్ధంగా వున్నారని తెలిపారు.