వైకాపాకు మరో ఎదురు దెబ్బ సుజనా చౌదరి సమక్షంలో బి సి నేత కనిసెట్టి లక్ష్మణ రావు భాజాపా లో చేరిక

Spread the love

 వైకాపాకు మరో ఎదురు దెబ్బ 

సుజనా చౌదరి సమక్షంలో బి సి నేత కనిసెట్టి లక్ష్మణ రావు భాజాపా లో చేరిక

సుజనా కు జై కొట్టిన బీసీ నేతలు 

విజయవాడ, మే 7

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో రోజురోజుకు బీసీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో ఆ పార్టీ లో చేరుతున్నారు. వైయస్ఆర్ బి సి నేత కనిశెట్టి లక్ష్మణరావు సుజనా చౌదరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు కంశెట్టి లక్ష్మణ చేరికతో వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైకాపా పార్టీ లో చురుగ్గా పనిచేసే కనిశెట్టి లక్ష్మణ చేరికతో బీసీలందరూ సుజనాకు జై కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోందని నియోజకవర్గంలో సుజన గాలి బాగా వీస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

పెద్ద ఎత్తున వైకాపా నుంచి భాజపాలో చేరడం తో నియోజకవర్గంలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *