వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఐదు జిల్లాల అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి సమావేశంహాజరైన

0

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఐదు జిల్లాల అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి సమావేశంహాజరైన గుంటూరు, ఎన్టీఆర్‌, క్రిష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, పార్లమెంట్‌ అబ్జర్వర్స్‌, జిల్లా అధ్యక్షులుతాడేపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బూత్‌ లెవల్‌నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు.1. గ్రామస్ధాయి వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి2. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపట్టడం, కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పించడం, చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి వచ్చేలా ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, నాయకులు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని నేతలకు వైవీ సుబ్బారెడ్డి సూచన3. అంకితభావం, కష్టపడేతత్వం, కెపాసిటీ ఉండే వ్యక్తులకు పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలి4. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలి5. ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సమన్వయంతో ముందుకెళ్ళాలి6. అక్రమ కేసులు, వేధింపులను గట్టిగా ఎదుర్కుని కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదాం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version