వెలంపల్లి ని కలిసన వైద్య విద్యార్థులు తమకు మద్దతు ఇవ్వాలని కోరిన వైద్య విద్యార్థులు

1
0

విజయవాడ
02-07-2025

  • వెలంపల్లి ని కలిసన వైద్య విద్యార్థులు
  • తమకు మద్దతు ఇవ్వాలని కోరిన వైద్య విద్యార్థులు ..
  • విద్యార్థులకు అండగా ఉంటాం – వెలంపల్లి
  • వైద్య విద్యార్థులు చేసేటువంటి నిరసన కార్యక్రమానికి వైకాపా తరఫున మద్దతు తెలుపుతాం – వెలంపల్లి స్థానిక బ్రాహ్మణ వీధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో బుధవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లో చదువుతున్నా విద్యార్థులు వెలంపల్లి శ్రీనివాస రావు ని కలిసి తమ సమస్యలు తెలిపి వినతిపత్రం ఇచ్చి గురువారం ధర్నా చౌక్ లో జరుగు నిరసన కార్యక్రమానికి విచ్చేసి తమ మద్దతు తెలపాలని కోరారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు.వైద్య విద్యార్థుల జీవితాలతో ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్టర్ చలగాటమాడుతురన్నారు.వైద్య విద్య పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు వెంటనే డాక్టర్ పట్టాలను ఇవ్వాలని కోరారు. గురువారం నాడు వైద్య విద్యార్థులు చేసేటువంటి నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here