విజయవాడ నగరపాలక సంస్థ
03-03-2025
విజయవాడ నగరపాలక సంస్థ మెప్మా, హోమ్ ట్రయాంగిల్ ఆధ్వర్యంలో హోమ్ సేవలు
విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మెప్మా, హోమ్ ట్రయాంగిల్ సంయుక్తంగా ప్లంబింగ్ సేవలు, విద్యుత్ సేవలు, గృహపకరణాలు, రిపేరింగ్ సేవలకు, హోమ్ ట్రయాంగిల్ అనే ఆప్ ద్వారా వారిలో గల నైపుణ్యం ను విజయవాడ నగర ప్రజలకు అందించి, చక్కటి ఆదాయాన్ని పొందటానికి సదవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు మెప్మా ఎండి తేజ్ భరత్. సోమవారం ఉదయం గవర్నర్ పేటలో గల ఎలక్ట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ ను విచ్చేసి అక్కడున్న సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మెప్మా ఎం డి తేజ భరత్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు పూర్తి అయ్యే తరుణంలో సర్వీస్ ప్రొవైడర్లను ఆన్ బోర్డ్ చేస్తున్నారని ఇప్పటివరకు 824 సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించారని, వారి సేవలను అతి త్వరలో ప్రజలకు అందించి వారి ఆదాయాన్ని పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. 824 సర్వీస్ ప్రొవైడర్లను కేవలం శిక్షణ ఇవ్వటమే కాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ ను వారికి అంద చేశారని తెలిపారు. వారికి కేవలం ఉచితంగా శిక్షణ ఇవ్వటమే కాకుండా హోమ్ ట్రయాంగిల్ అనే యాప్ లో ఉచితంగా ఆన్ బోర్డ్ చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, నగరపాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.