విజయవాడ, 30 – 07 – 2025.
- విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణ.
- ఫలించిన సీఎం చంద్రబాబు కృషి.
- హజ్ యాత్రికులు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
- చంద్రబాబు, ఫరూక్, కేంద్ర మైనారిటీ శాఖ కు ధన్యవాదాలు.
- షేక్.అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు ఏపీ హజ్ కమిటీ సభ్యులు.
గన్నవరం విమానాశ్రయ ఎంబార్కేషన్ పాయింట్ ను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ కు స్పందిస్తూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజయవాడను హజ్ ఎంబార్కేషన్ పాయింట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మరియు ఏపీ హజ్ కమిటీ సభ్యులు అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడను తిరిగి ఎంబార్కేషన్ పాయింట్ గా చేర్చడం ముస్లిం యాత్రికుల కు పెద్ద ఊరట అని తెలిపారు. ముస్లిం సోదరులు ఇక పై హజ్ యాత్ర కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన రాష్ట్రం నుంచే హజ్ యాత్ర ప్రారంభించవచ్చని తెలిపారు. ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలోని యాత్రికులకు ప్రయాణ శ్రమ తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్తులో విజయవాడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ వద్ద మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ కు, ముఖ్యంగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.