విజయవాడలో 6వ పత్తి గింజ, నూనె & మేళ్ కాన్‌క్లేవ్‌ 2025 నిర్వహణ

0

“పత్తి గింజలకు నూతన ప్రాణం – నూనె, మేళ్ మరియు ఇతర వినియోగాలలో అభివృద్ధి దారులు”
విజయవాడ, ఆగస్ట్ 2, 2025:
భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ మరియు ఆఖిల భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ వివాంతా వేదికగా ఆరో కాటన్ సీడ్, ఆయిల్ & మేళ సమావేశం నిర్వహించబడింది. “పత్తి గింజలకు నూతన ప్రాణం – నూనె, మేళ్ మరియు ఇతర వినియోగాలలో అభివృద్ధి దారులు” అనే విషయవస్తువు నేపథ్యంలో, ఈ కాన్‌క్లేవ్‌ దేశంలోని ఆరోగ్యకరమైన వంట నూనె భద్రతను పెంపొందించడంలో, పశు పోషకాహార పరిశ్రమకు తోడ్పడటంలో మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడంలో పత్తి గింజల ఉపయోగాన్ని పరిశీలించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కాన్‌క్లేవ్‌లో పత్తి సాగు, కోత అనంతర ప్రక్రియలు, నూనె శుద్ధీకరణ సాంకేతికత, పశు పోషకాహార తయారీ, పోషక విలువలు, స్మార్ట్ ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెట్ అంచనాలు, మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై నిపుణుల ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు నిర్వహించబడ్డాయి. “Cotton 360°”, “ప్రాసెసింగ్‌లో సాంకేతిక ఆధునికతలు”, “ఆధునిక పోషణలో పత్తి గింజ నూనె పాత్ర” వంటి అంశాల చుట్టూ చర్చలు సాగాయి.
ఈ సందర్భంగా పరిశోధకులు మరియు విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలకు గుర్తింపుగా నీలేష్ పటేల్ ఇన్నోవేషన్ అవార్డులు’ అందజేయబడ్డాయి.
ఈ కార్యక్రమాన్ని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్లి నరేంద్ర ప్రారంభించారు. 300కి పైగా శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు, పాలసీమేకర్లు, వ్యాపారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా వంట నూనె మరియు పశు పోషకాహార రంగాలలో పత్తి గింజ వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని అందరూ సమీక్షించారు. 2024–25లో దేశవ్యాప్తంగా పత్తి సాగు 9.8 శాతం తగ్గిన నేపథ్యంలో, గింజల విలువను గరిష్టంగా వినియోగించాలన్న సందేశాన్ని ఈ వేదిక మిళితంగా ఉంచింది.
కాన్ఫరెన్స్‌లో ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూప్ రాషి, 3F లిమిటెడ్ డైరెక్టర్ ఓ.పి. గోయెంకా, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పాల్గొన్నారు.
ఇతర ప్రముఖ అతిథులుగా SEA వైస్ ప్రెసిడెంట్ అంగ్షు మాలిక్, AICOSCA చైర్మన్ సందీప్ బజోరియా, AICOSCA వైస్ చైర్మన్ పి. వీర నారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధూళిపాళ్లి నరేంద్ర మాట్లాడుతూ
“పత్తి పరిశ్రమలో ప్రముఖుల మధ్య ఈ వేదికపై భాగస్వామిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది.”
భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ సంఘం వైస్ ప్రెసిడెంట్ అంగ్షు మాలిక్ వ్యాఖ్యానిస్తూ
“వ్యవసాయ రంగానికి వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన విజయవాడలో 6వ కాన్‌క్లేవ్‌ను నిర్వహించడం ఎంతో గర్వకారణం. ఈ సంవత్సరం తీసుకున్న ప్రధాన అంశం పత్తి గింజను ఆరోగ్యకరమైన వంట నూనెగా మాత్రమే కాకుండా, పశు పోషకాహార రంగానికి కీలకంగా మరియు గ్రామీణాభివృద్ధికి దోహదపడే వనరుగా ఉపయోగించాలన్న మా సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. విలువ గొలుసులోని అన్ని భాగస్వాములు కలిసి, ఈ వేదికపై అభిప్రాయాలు పంచుకుని, స్థిరమైన అభివృద్ధికి దారులు రూపొందించగలిగారు.”
భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ , చైర్మన్ సందీప్ బజోరియా వ్యాఖ్యానిస్తూ
“పత్తి గింజ నూనె వంటగదుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నూనె. ఇతర నూనెల రుచి మరియు వాసన ప్రమాణాలను అంచనా వేయడంలో ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. ఇది ఆసియాలోని అనేక వంటకాలలో ప్రధాన పదార్థం. పత్తి మేళ్ పశు పోషకాహారంగా అద్భుతమైన విలువ కలిగి ఉంది. ఈ కాన్‌క్లేవ్‌ ద్వారా పత్తి గింజ నూనె వినియోగాన్ని ప్రోత్సహించడం, శుద్ధీకరణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, పత్తి ఆధారిత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తేయడంపై దృష్టి పెట్టాం.”
భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి.వి. మెహతా తెలియజేస్తూ
“ప్రస్తుతం దేశంలో వార్షికంగా సుమారు 11.5 నుండి 12 లక్షల టన్నుల పత్తి గింజ నూనె ఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఇది 18 లక్షల టన్నుల వరకు పెంచే సామర్థ్యం ఉంది. దీంతో దేశ వంట నూనె అవసరాలను తీర్చడమే కాకుండా, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చు.”
భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ , ఉపాధ్యక్షుడు మరియు ధనలక్ష్మి కాటన్ అండ్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సంస్థ డైరెక్టర్ వైస్ చైర్మన్ పి. వీర నారాయణ తెలియజేస్తూ
“ఆంధ్రప్రదేశ్ పత్తి గింజల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం ఈ సదస్సును విజయవాడలో నిర్వహించడం చాలా సమంజసం.”
(ఐసీఏఆర్-సర్కాట్, ముంబయి డైరెక్టర్) డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. శుక్లా అన్నారు
“భారతదేశంలో పత్తి రంగం మానవ శ్రమపై ఆధారపడిన స్థితిలో ఉంది. ప్రపంచ స్థాయిలో పోటీ పెరుగుతున్న ఈ సందర్భంలో, మన ఉత్పత్తి ఖర్చులు 15–20 శాతం ఎక్కువగా ఉండటంతో, యాంత్రీకరణ ఇక ఎంపిక కాకుండా అవసరంగా మారింది. ప్రస్తుతం కేవలం 8–10 శాతం పత్తి గింజలకే శాస్త్రీయ శుద్ధీకరణ జరుగుతోంది. దీని వల్ల నూనె రికవరీ పెరగడమే కాక, విలువైన లింటర్‌ను కూడా రక్షించవచ్చు. ఈ నష్టాల విలువ దాదాపు రూ. 5000 కోట్లకు చేరుతుంది. కనుక, శాస్త్రీయంగా, యాంత్రీకృతంగా పత్తి శుద్ధీకరణను ప్రోత్సహించడం అవసరం. ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన ‘టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్’లో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.”

విజయవాడలో 6వ పత్తి గింజ, నూనె & మేళ్ కాన్‌క్లేవ్‌ 2025 నిర్వహణ
“పత్తి గింజలకు నూతన ప్రాణం – నూనె, మేళ్ మరియు ఇతర వినియోగాలలో అభివృద్ధి దారులు”
విజయవాడ, ఆగస్ట్ 2, 2025:
భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ మరియు ఆఖిల భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ వివాంతా వేదికగా ఆరో కాటన్ సీడ్, ఆయిల్ & మేళ సమావేశం నిర్వహించబడింది. “పత్తి గింజలకు నూతన ప్రాణం – నూనె, మేళ్ మరియు ఇతర వినియోగాలలో అభివృద్ధి దారులు” అనే విషయవస్తువు నేపథ్యంలో, ఈ కాన్‌క్లేవ్‌ దేశంలోని ఆరోగ్యకరమైన వంట నూనె భద్రతను పెంపొందించడంలో, పశు పోషకాహార పరిశ్రమకు తోడ్పడటంలో మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడంలో పత్తి గింజల ఉపయోగాన్ని పరిశీలించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కాన్‌క్లేవ్‌లో పత్తి సాగు, కోత అనంతర ప్రక్రియలు, నూనె శుద్ధీకరణ సాంకేతికత, పశు పోషకాహార తయారీ, పోషక విలువలు, స్మార్ట్ ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెట్ అంచనాలు, మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై నిపుణుల ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు నిర్వహించబడ్డాయి. “Cotton 360°”, “ప్రాసెసింగ్‌లో సాంకేతిక ఆధునికతలు”, “ఆధునిక పోషణలో పత్తి గింజ నూనె పాత్ర” వంటి అంశాల చుట్టూ చర్చలు సాగాయి.
ఈ సందర్భంగా పరిశోధకులు మరియు విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలకు గుర్తింపుగా నీలేష్ పటేల్ ఇన్నోవేషన్ అవార్డులు’ అందజేయబడ్డాయి.
ఈ కార్యక్రమాన్ని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్లి నరేంద్ర ప్రారంభించారు. 300కి పైగా శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు, పాలసీమేకర్లు, వ్యాపారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా వంట నూనె మరియు పశు పోషకాహార రంగాలలో పత్తి గింజ వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని అందరూ సమీక్షించారు. 2024–25లో దేశవ్యాప్తంగా పత్తి సాగు 9.8 శాతం తగ్గిన నేపథ్యంలో, గింజల విలువను గరిష్టంగా వినియోగించాలన్న సందేశాన్ని ఈ వేదిక మిళితంగా ఉంచింది.
కాన్ఫరెన్స్‌లో ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి రూప్ రాషి, 3F లిమిటెడ్ డైరెక్టర్ ఓ.పి. గోయెంకా, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు శ్రీ పొట్లూరి భాస్కరరావు పాల్గొన్నారు.
ఇతర ప్రముఖ అతిథులుగా SEA వైస్ ప్రెసిడెంట్ అంగ్షు మాలిక్, AICOSCA చైర్మన్ సందీప్ బజోరియా, AICOSCA వైస్ చైర్మన్ శ్రీ పి. వీర నారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధూళిపాళ్లి నరేంద్ర మాట్లాడుతూ
“పత్తి పరిశ్రమలో ప్రముఖుల మధ్య ఈ వేదికపై భాగస్వామిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది.”
భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ సంఘం వైస్ ప్రెసిడెంట్ అంగ్షు మాలిక్ వ్యాఖ్యానిస్తూ –
“వ్యవసాయ రంగానికి వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన విజయవాడలో 6వ కాన్‌క్లేవ్‌ను నిర్వహించడం ఎంతో గర్వకారణం. ఈ సంవత్సరం తీసుకున్న ప్రధాన అంశం పత్తి గింజను ఆరోగ్యకరమైన వంట నూనెగా మాత్రమే కాకుండా, పశు పోషకాహార రంగానికి కీలకంగా మరియు గ్రామీణాభివృద్ధికి దోహదపడే వనరుగా ఉపయోగించాలన్న మా సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. విలువ గొలుసులోని అన్ని భాగస్వాములు కలిసి, ఈ వేదికపై అభిప్రాయాలు పంచుకుని, స్థిరమైన అభివృద్ధికి దారులు రూపొందించగలిగారు.”
భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ , చైర్మన్ సందీప్ బజోరియా వ్యాఖ్యానిస్తూ ––
“పత్తి గింజ నూనె వంటగదుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నూనె. ఇతర నూనెల రుచి మరియు వాసన ప్రమాణాలను అంచనా వేయడంలో ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. ఇది ఆసియాలోని అనేక వంటకాలలో ప్రధాన పదార్థం. పత్తి మేళ్ పశు పోషకాహారంగా అద్భుతమైన విలువ కలిగి ఉంది. ఈ కాన్‌క్లేవ్‌ ద్వారా పత్తి గింజ నూనె వినియోగాన్ని ప్రోత్సహించడం, శుద్ధీకరణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, పత్తి ఆధారిత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తేయడంపై దృష్టి పెట్టాం.”
భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి.వి. మెహతా తెలియజేస్తూ –
“ప్రస్తుతం దేశంలో వార్షికంగా సుమారు 11.5 నుండి 12 లక్షల టన్నుల పత్తి గింజ నూనె ఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఇది 18 లక్షల టన్నుల వరకు పెంచే సామర్థ్యం ఉంది. దీంతో దేశ వంట నూనె అవసరాలను తీర్చడమే కాకుండా, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చు.”
భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ , ఉపాధ్యక్షుడు మరియు ధనలక్ష్మి కాటన్ అండ్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సంస్థ డైరెక్టర్ వైస్ చైర్మన్ పి. వీర నారాయణ తెలియజేస్తూ
“ఆంధ్రప్రదేశ్ పత్తి గింజల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం ఈ సదస్సును విజయవాడలో నిర్వహించడం చాలా సమంజసం.”
(ఐసీఏఆర్-సర్కాట్, ముంబయి డైరెక్టర్) డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. శుక్లా అన్నారు –
“భారతదేశంలో పత్తి రంగం మానవ శ్రమపై ఆధారపడిన స్థితిలో ఉంది. ప్రపంచ స్థాయిలో పోటీ పెరుగుతున్న ఈ సందర్భంలో, మన ఉత్పత్తి ఖర్చులు 15–20 శాతం ఎక్కువగా ఉండటంతో, యాంత్రీకరణ ఇక ఎంపిక కాకుండా అవసరంగా మారింది. ప్రస్తుతం కేవలం 8–10 శాతం పత్తి గింజలకే శాస్త్రీయ శుద్ధీకరణ జరుగుతోంది. దీని వల్ల నూనె రికవరీ పెరగడమే కాక, విలువైన లింటర్‌ను కూడా రక్షించవచ్చు. ఈ నష్టాల విలువ దాదాపు రూ. 5000 కోట్లకు చేరుతుంది. కనుక, శాస్త్రీయంగా, యాంత్రీకృతంగా పత్తి శుద్ధీకరణను ప్రోత్సహించడం అవసరం. ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన ‘టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్’లో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.”

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version