లైంగిక దాడి ఆరోపణలు.. మాజీ సీఎం యడియూరప్పపై కేసు!

0


 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పపై లైంగిక దాడి ఆరోపణలతో తాజాగా కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సోచట్టం, ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద యడియూరప్పపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగింది. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సాయం కోసం వెళితే ఇలా జరిగిందని బాధిత బాలిక, ఆమె తల్లి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేసిన విషయం తెలిసిందే. 2008-2011 మధ్య కొన్ని సార్లు, 2018 మే నెలలో కొంతకాలం, ఆ తరువాత మళ్లీ 2019-2021 మధ్య సీఎంగా ఉన్నారు. ఆ తరువాత ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై 2023 ఎన్నికల వరకూ సీఎంగా ఉన్నారు. తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version