‘లంకా దినకర్ ని ఘనంగా సన్మానించిన NTR జిల్లా BJP శాఖ’

0

 ‘లంకా దినకర్ ని ఘనంగా సన్మానించిన NTR జిల్లా BJP శాఖ’

భారతీయజనతాపార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి 20 సూత్రాల పథకం రాష్ట్ర చైర్మన్  లంకా దినకర్  ఎన్టీఆర్ జిల్లా పర్యటన లో భాగంగా ఈరోజు  ది( 22-03-2025) , శనివారం  ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస యోజన,జల్ జీవన్ మిషన్ ,PM కిసాన్ యోజన,అమృత పథకం,పనికి ఆహార పథకం వంటి పథకాల అమలు తీరును సమీక్షించడం జరిగిందని,ఇప్పటి వరకు 15 జిల్లాల పర్యటన పూర్తి అయ్యిందని 16 జిల్లాగా NTR జిల్లా పర్యటించడం జరిగిందని ఆయన వివరించారు.  తదనంతరం సాయంత్రం 5.30 ని లకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ NTR జిల్లా నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లంకా దినకర్  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలకు  కేటాయించిన నిధులకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించే బాధ్యతను  నిర్వహిస్తున్నారని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా వెంటిలేటర్ పై వుందని,అటువంటి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చెయ్యి అందించి ముందుకు నడిపిస్తుందని,అలాగే కేంద్రంలోని నరేంద్ర మోదిగారి ప్రభుత్వం చిట్ట చివరి పేదవాడికి అంత్యోదయ సిద్దాంతం ద్వారా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి చేస్తుందని,నాకు  ఈ పధవిని ఇప్పించడానికి కారణమైన  నాయకుల అందరికి ప్రత్యేక ధన్యవాదములని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ,బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చ అధ్యక్షులు షేక్ బాజి,జాతీయ SC మోర్చ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగ లక్ష్మి ,NTR జిల్లా BJP సీనియర్ నాయకులు మువ్వల సుబ్బయ్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని లంకా దినకర్ ని సాలువాలు పూల దండలు,బొకేలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు అనేక సమస్యలపై  వినతి పత్రాలు వారికి అందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version