రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు.

0

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం ,విజయవాడ.
తేదీ. 08.06.2025.

రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు.

ఈ రోజు ది.08.06.2025వ తేదీన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్ల పోలీసు అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీసు స్టేషన్ పరిదిలోని రౌడీషీటర్ లకు, లా & ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్ట్ లకు మరియు చెడునడత కలిగిన వ్యక్తులకు వివిధ సమయాలలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ........ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రామాలలో పాల్గోవడం చేయరాదని, ఎవరైనా  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన  వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్ధాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా  సత్ ప్రవర్తన మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవ్వరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version