ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ తేదీ.31-07-2025
రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్
ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం .. రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.
విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఆంద్రపదేశ్ కు ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్
టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేలా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు వినూత్న కార్యాచరణ
ఎన్.టి.ఆర్.జిల్లా ట్రాఫిక్ విభాగానికి 14 డ్రోన్స్
ఇప్పటికే ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ భద్రత అంటే కేవలం భరోసా కాదు నిరంతర పర్యవేక్షణ-100 శాతం సి.సి.కెమెరాల ఏర్పాటు.
డ్రోన్స్ లను అంధించిన ధాతలకు చిరు సత్కారం
ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేలా ఎన్.టి.ఆర్ జిల్లా ట్రాఫ్ఫిక్ విభాగానికి డ్రోన్లు, మోటార్ వాహనాలను, బ్యాటన్లు, ఇతర ట్రాఫిక్ పరికరాలు అంధించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొన్న రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. వారి చేతుల మీదుగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి 14 డ్రోన్ కెమెరాలను, 350 బ్యాటన్ లైట్స్ లను,720 కాకి క్యాప్స్ లను అంధించడం జరిగింది. అనంతరం రాష్ట్ర డి.జి.పి. 40 ట్రాఫిక్ పెట్రోలింగ్ మోటార్ వాహనాలను పచ్చ జెండా ఊపి ప్రారంబించడం జరిగింది.
ఈ నేపధ్యంలో ముఖ్య అతిది రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. సాంకేతిక పరిజ్ఞానంను ఆయుధంగా చేసుకుని ఎన్.టి.ఆర్ పోలీసు కమిషనరేట్ సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికె తలమానికంగా నిలిచిందన్నారు. స్మార్ట్ గా వ్యవహరిస్తూ టెక్నాలజీని ఉపయోగించి విజయవాడ సిటీ ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. పని తీరు బాగుంది. డ్రోన్ ల వినియోగం లో ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ రాష్ట్రం లో ప్రధమ స్థానంలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఎన్.టి.ఆర్.జిల్లా అధికారులు మరియు సిబ్బంది చాలెంజ్ గా తీసుకుని పని చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ లో అస్త్రం టూల్ ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ఇంటర్ నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖపట్నం లో నిర్వహించిన యోగాంద్ర కార్యక్రమంలో అస్త్రం టూల్ ఉపయోగించి ట్రాఫ్ఫిక్ నియంత్రించడంతో ఎక్కడా ఏచిన్న సంఘటన లేకుండా విజయవంతం అయ్యింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. విజయవాడ లో ట్రాఫిక్ జాబ్ అనేది చాలా టఫెస్ట్ జాబ్, ఉదయం నుండి రాత్రి వరకు నిలబడి ట్రాఫిక్ ను నియంత్రించాలి, కాలుష్యం, ఎండ, వాన లు లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. చాలా అంశాల్లో ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసులు పని తీరు అంధరికి ఆదర్శంగా ఉంది. సిసి కెమెరాలు, డ్రోన్ ల ద్వారా నేరాలు చాలా వరకు తగ్గాయి అని తెలియజేశారు. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఆంద్రపదేశ్ కు ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. అన్నీ జంక్షన్లలో ఏ.ఐ.ఆధారిత ట్రాఫిక్ సింగ్నల్ లైట్స్ లను ఏర్పాటు చేస్తాము.
ఈ నేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ…….ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ కు ప్రభుత్వం, దాతల సహకారంతో పలు సాంకేతిక పరమైన పరికరాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ కు ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి పలు అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. చేతుల మీదుగా ట్రాఫిక్ విభాగానికి 14 డ్రోన్స్ లను అంధిచడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ లో అస్త్రం టూల్ ద్వారా సరి కొత్త పనితీరు ఉంటుంది. కమిషనరేట్ పరిధిలో ప్రతి గ్రామంలో సి.సి.కెమెరా ఉండేలాగా వేలసంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం వలన ట్రాఫిక్ నియంత్రణ తోపాటు, నాలుగు కీలక దొంగ తనాల కేసులను చేధించాం, ఇప్పుడు డ్రోన్ ల ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తాం, డ్రోన్స్ వినియోగం కోసం ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం, ఈ డ్రోన్ల ను కమాండ్ కంట్రోలు కు అనుసంధానం చేశాం, అన్ని చోట్లా సిసి కెమెరాలతో రాంగ్ డ్రైవింగ్ ను గుర్తుంచలేం, ఇటువంటి ప్రాంతాలు తో పాటు, వారధి, బ్యారేజి వంటి ప్రాంతాల్లో డ్రోన్ల పని తీరు తో మంచి ఫలితాలు ఉంటాయి. ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనాలు,14 డ్రోన్ లు, బ్యాటిన్ లు డిజిపి చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి అంధించడం చాలా ఆనంధంగా ఉంది.
ఈ క్రమంలో ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ వచ్చిన తరువాత విజయవాడ నగరం లో ట్రాఫిక్ నియంత్రణ లో తరువాత టెక్నాలజీ ఆధారంగా తీసుకున్న పలు సంస్కరణలను, నగరంలో ట్రాఫిక్ రద్ధీ ఏ విధంగా తగ్గింది, మొదలగు అంశాల గురించి వివరించడం జరిగింది.
అనంతరం సహకరించిన ధాతలను దుశ్శాలువ మరియు మేమేంటోలతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. కె.ఎం.మహేశ్వర రాజు ఐ.పి.ఎస్. ఏ.బి.టి.ఎస్. ఉదయారాణి ఐ.పి.ఎస్. ట్రాఫిక్ ఏ.డి.సి.పి. ఎ.వి.ఎల్.ప్రసన్న కుమార్ ఇతర పోలీసు అధికారులు, ధాతలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.