రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా NDA కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని సెంట్రల్ MLA బోండా ఉమ అన్నారు

7
0

 21-9-2024

రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా NDA కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని సెంట్రల్ MLA బోండా ఉమ అన్నారు

*ఘనంగా సెంట్రల్ నియోజకవర్గంలో 2వ రోజు “ఇది మంచి ప్రభుత్వం” వేడుకలు*

*ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  విజయవాడ నగరం వరదలలో విలవిల లాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలకు ఓ తండ్రిలా కాపాడుకున్నారు-బోండా ఉమ*

ది:-21-09-2024 శనివారం ఉదయం 10:00″గం లకు”గంటలకు 59వ డివిజన్ సింగ్ నగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం, రైతు బజార్ వద్ద నుండి సంక్షోభంలోనూ సంక్షేమం అందించి ప్రజల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వ 100 రోజుల పరిపాలనపై స్థానికులతో ఇంటింటికీ కి వెళ్లి స్టికర్లు అంటింస్తూ ఇది మంచి ప్రభుత్వాం కూటమి ప్రభుత్వం అంటూ నినాదలు చేస్తూ, ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన  మంచి పనులను ప్రజలకు బొండా ఉమా  వివరించారు…

అనంతరం:- గుజ్జల సరళ దేవి కళ్యాణ మండపం నందు 30,57,58,59 డివిజన్ ల ప్రజల భాగస్వామ్యంతో  “మంచి ప్రభుత్వం”కార్యక్రమం నిర్వహించి ప్రజలతో నాయకులతో బొండా ఉమా కేక్ కట్ చేపించి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది…

ముందుగా అమరజీ  పొట్టి శ్రీరాములు   విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బోండా ఉమా  మాట్లాడుతూ :-100 రోజులు ఎన్డీఏ పాలనలో  సీఎం చంద్రబాబు నాయుడు  అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకుంటుందన్నారు…

అవ్వ తాతల పెన్షన్ 4000,వికలాంగుల పెన్షన్ 6000,లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు”, యువత భవిష్యత్తుకు “మెగాడీఎస్సీ” ప్రజల ఆస్తుల భద్రతకు  ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ ర ద్దు,వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు, కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు…

చంద్రబాబు  ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి 100 రోజులు,ఇందులో 10 రోజులు వరదలతోనే సరిపోయింది అని. అయితే ఆ పది రోజుల్లో  వరధ బాధితులను ఆదుకున్న చంద్రబాబు  సమర్థత గురించి ప్రజలు వేనోళ్ళ పొగుడుతున్నారు అని.ఈ వంద రోజుల్లో చంద్రబాబు  అందించిన పాలనకు వంక పెట్టలేం అని ప్రజలే అంటున్నారు అని…

చంద్రబాబుగారి పాలన ఎలా ఉంటుందో ప్రజలకు బాగా తెలుసు అని, ఇప్పటికే మూడు పర్యాయాలు ఆయన పాలనను చూసారు,గత ఐదేళ్లుగా రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది అని…

సెప్టెంబర్ 1 నుండి 10 వ తారీకు వరకు విజయవాడ నగరంలో ప్రజలు వరదలతో అల్లల్లాడిపోతే ఎమ్మెల్యేలుగా తమను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో ప్రజల మధ్యనే ఉండాలని వారి క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బోటులో తమతో కలిసి ప్రజల వద్దకే వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారని, ఇటువంటి సమయంలో రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా గట్టెక్కిస్తారా అని చూస్తున్న ప్రజలకు ఈ 100 రోజుల పాలన చూసాక ఒక భరోసా లభించింది అని…

అందరి మంచి కోరుతూ, రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ, ప్రజలతో  “ఇది మంచి ప్రభుత్వం” అనిపించుకుంది కూటమి సర్కారు అని, దిగ్విజయంగా వంద రోజులు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” పోస్టర్‌ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర్  ఆవిష్కరించడం జరిగినది…

ఈ కార్యక్రమంలో:-తెలుగుదేశం, జనసేన ,బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here