యన్ టి ఆర్ జిల్లా
06.05.2024.
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి
మైలవరం నియోజకవర్గం మైలవరం మండలంలోని మైలవరం, పుల్లూరు, వెళ్వడం, గణపవరం, చంద్రాల గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్తు, ఫ్యాన్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, షామియానా వసతులను సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోమని బిఎల్ఓ లను ఆదేశించారు. అధిక శాతం పోలింగ్ జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోమని ఆదేశించారు.
మైలవరం లోని లక్కిరెడ్డి లక్ష్మి రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఉన్న ఈవీఎం మాక్ పోల్ సెంటర్ , లక్కిరెడ్డి బాల్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎలక్షన్ స్టాఫ్ శిక్షణా తరగతులను, పోస్టల్ బ్యాలట్ ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు.