
పార్వతిపురం మన్యం జిల్లా, భామిని:
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రగతి నివేదికను సమర్పించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
⦁ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి… దీనికి అందరూ సహకరించాలి.
⦁ విద్యార్థులు అద్భుతంగా మీటింగ్ నిర్వహించారు.
⦁ మూడేళ్లల్లో ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు
⦁ భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జీ అద్భుతంగా ఉంది.. త్వరలో వాళ్ల నుంచే నేను నేర్చుకునే రోజు వస్తుంది
⦁ పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు
⦁ విద్యలో పిల్లల బలాబలాలు తెలుకునేందుకు… దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్, స్టీమ్ అనే మూడు వర్గాలుగా వర్గీకరించారు.
⦁ క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది.
⦁ నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది… పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు
⦁ పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా… ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా చేయడం బాగుంది.
⦁ పిల్లలు మట్టిలో మాణిక్యాలు… సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు
⦁ కరుణకుమారి… అంధ విద్యార్థి… ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించింది
⦁ పల్నాడు మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు… అలాగే ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
⦁ ఒకప్పుడు పిల్లలు భారం… కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్
⦁ మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచాం
⦁ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం
⦁ స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా ఇస్తున్నాం
⦁ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రవచనాలను… విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు
⦁ తల్లితండ్రి కష్టపడతారు… గురువులు విద్య బోధిస్తారు… కానీ ఇవాళ్టీ రోజుల్లో విలువలు తగ్గిపోతున్నాయి
⦁ విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని.. దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం
⦁ గతంలో విద్యార్థులకు చాలా యాప్ లు ఉండేవి… ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించాం
⦁ శనివారం నో బ్యాగ్ డే… ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు
⦁ 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు.. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు
⦁ చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం
⦁ షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం
⦁ విద్యలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు క్లస్టర్ అప్రోచ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు
⦁ ప్రపంచంలో లెర్నింగ్ విధానాలు అధ్యయనం చేస్తున్నారు… విదేశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు
⦁ టీచర్లను రిక్రూట్ చేయకుండా చదువు చెబితే అది బూటకమే
⦁ ప్రభుత్వ టీచర్లను నియమించాం… చక్కటి చదువును చెప్పిస్తున్నాం
⦁ మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు
⦁ కానీ దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ఏడాదిలోనే డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం
⦁ ట్రాన్సఫర్లను పారదర్శకంగా నిర్వహించాం
⦁ గతంలో టీచర్లను అవమానించారు… మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు
⦁ టీచర్లను గౌరవించే బాధ్యత మాది… పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే టీచర్లది
⦁ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.
⦁ కానీ ప్రైవేట్ స్కూళ్లల్లో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు.
⦁ ఇంతటి స్టాఫ్ ను ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చాం… ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి
⦁ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది… మేం సరి చేస్తున్నాం.
![]()
