ముస్లింల త్యాగానికి, సత్యానికి సూచికగా నిలిచిన బక్రీద్ నాడు, మహమ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వాన్ని, సహోదరభావాన్ని చాటుదాం MLA బొండా ఉమ

0

06-6-2025*ముస్లింల త్యాగానికి, సత్యానికి సూచికగా నిలిచిన బక్రీద్ నాడు, మహమ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వాన్ని, సహోదరభావాన్ని చాటుదాం – MLA బొండా ఉమ ధి:6-6-2025 శుక్రవారం ఉదయం 11:30″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు SK జాన్ వలి, SK సలాం, SK భాజీ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 50 పేద మైనారిటీ కుటుంబాలకు బక్రీద్ తోఫా 1kg గోధుమ రవ్వ, 1kg బాస్మతి బియ్యం, 1లీటర్ మంచి నూనె, 250 grams నెయ్యి, 1kg బెల్లం కిట్లను వారికి అందజేసి సెంట్రల్ నియోజకవర్గ  ముస్లిం సోదరీ సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ  సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున తాము అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలకు ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటున్నామని, 2014 నుండి 2019 వరకు అప్పుడు తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రంజాన్, బక్రీద్, దసరా, వినాయక చవితి, సంక్రాంతి, క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకునే వారమని, తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి  వైయస్సార్సీపి  పార్టీ ఏ ఒక్క పండుగను చేయకుండా  పెరిగిపోయినటువంటి ఖర్చుల భారాన్ని ప్రజల పైన వేసి పండుగల అంటేనే మహిళలు భయపడే విధంగా చేశారని2024 లో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించి స్వర్ణ యుగాన్ని తిరిగి తెప్పించారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొందని తెలుగుదేశం పార్టీ అంటేనే మైనారిటీ పార్టీ అని, బక్రీద్ పండుగ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీక మహ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సోదర భావాన్ని అందరూ అనుసరించాలని రేపు బక్రీద్ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బక్రీద్ కి ఒకరోజు ముందుగానే తెలుగుదేశం పార్టీ తరుపున తోఫా పంచటం చాలా సంతోషమని అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, SK ఫర్వీన్,డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, బుదాల సురేష్, మహేష్, గౌసియా, రత్నకుమారి, హరమ్మ, వేల్పుల రాజేష్, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version