మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో అనగా 25. 6. 2025. మున్సిపల్ కార్మికుల సమ్మె జరిగింది

0

మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో అనగా 25. 6. 2025. మున్సిపల్ కార్మికుల సమ్మె జరిగింది .ఈ సమ్మెలో (వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానికల్ ,డ్రైవర్లు,క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్,పారిశుద్ధ్య,డ్రైనేజీ, డీపీ,stpi లు మలేరియా కార్మికులు) అందరు కూడ సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 36వ జీవో నెంబర్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతం పెంచాలని అలాగే తల్లికి వందనం,సంక్షేమ పథకాల అమలు చేయాలని, 12 వ పి ఆర్ సి ప్రకారం మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని… లేనియెడల జులై 4వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు… అలాగే దళిత శోషణ ముక్తి మంచ్ జాతీయ కన్వీనర్ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వైపు నుంచి కార్మికులకు రావలసిన పథకాలు ఏవి కూడా కార్మికులకు అందడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేనియెడల రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులు చేయబోయే సమ్మె కార్యక్రమాలకు ప్రభుత్వo బాధ్యత వహించాలని హెచ్చరించారు. అలాగే మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షుడు ధోనే పూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులంతా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలని ప్రభుత్వాల వైపు నుంచి కార్మికుల వైపు వస్తున్నటువంటి ప్రతి సమస్యను ఎర్రజెండా అండగా కార్మికులు ఎదుర్కోవాలని మున్సిపల్ కార్మికులు ఎండనకా వాననకా చేమటోడ్చి కష్టపడే కార్మికులు పట్టణాలను శుభ్రపరుస్తూ పర్యావరణం పరిశుభ్రతగా ఉంచుతూ ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాలకు మున్సిపల్ కార్మికులు ముందుండి వారికి అనేక అవసరతలను తీరుస్తూ ఉన్నారని కాబట్టే ప్రభుత్వాలు వాళ్లు చేసేటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసుకోగలుగుతున్నారని మున్సిపల్ కార్మికులు లేని ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగవని ఆ విధంగా పట్టణాలకు శుభ్రపరుస్తూ ప్రభుత్వాలకు సహకరిస్తున్న మున్సిపల్ కార్మిక సిబ్బందిని చిన్న చూపు చూడడం వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం వారికి చాలీచాలని జీతాలు ఇవ్వడం అలాగే ఇంజనీరింగ్ (పార్క్, మెకానికల్, వాటర్, స్ట్రీట్ లైటింగ్,టౌన్ ప్లానింగ్,కంప్యూటర్ ఆపరేటర్స్ )వీరందరికి కూడా జీతాలు పెంచాలని 12వ పిఆర్సి ప్రకారం వేతనాలు మున్సిపల్ పారిశుధ్య , ఇంజనీరింగ్ కార్మికులకు పెంచాలని లేనియెడల రాబోవు రోజుల్లో మున్సిపల్ కార్మికులంతా రోడ్లెక్కే పరిస్థితి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. ఈ సమ్మెకు సిపిఎం పార్టీ 50 వ డివిజన్ కార్పొరేటర్ బి.సతి బాబు మద్దతు తెలిపారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాసరావు,మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర ఆధ్యక్షుడు ఎస్.జ్యోతి బస్,నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ప్రవీణ్, నగర కోశాధికారి డి. స్టీఫెన్ బాబు, నగర ఉపాధ్యక్షురాలు టి తిరుపతమ్మ, విజయలక్ష్మి, శీలం దాసు, వి సాంబులు, కృష్ణవేణి, ఆదిశేషు, వాటర్ సెక్షన్ బాధ్యులు, దుర్గారావు నల్ల శీను, సైదులు, డ్రైనేజీ సెక్షన్ బాధ్యులు బత్తుల బ్రహ్మయ్య, జయరావు,నరేంద్ర, వర్క్ సెక్షన్ బాధ్యులు టీ చిన్న, వెంకటరావు, వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్ర నాగరాజు, జై.వీరబాబు, మెకానిక్ సెక్షన్ బాధ్యులు దుర్గాప్రసాద్ ,కోటేశ్వరరావు, అన్ని సెక్షన్ విభాగాల కార్మికులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version