మా ఆస్తులకు రక్షణ కల్పించండి
బీజేపీ నాయకుల అండతో నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు
న్యాయవాది.సుధాకర్ తో కలిసి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఇమ్మడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ
విజయవాడ కూటమి ప్రభుత్వంలోని బీజేపీ పార్టీలో కొందరు నేతల అండదండలు చూసుకొని కొత్త సుమతి అనే మహిళ నకిలీ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరి సంతకాలతో తన కుటుంబానికి చెందిన ఆస్తిని కాజేయాలని చూస్తుందని, కూటమి ప్రభుత్వం తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఇమ్మిడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ వేడుకున్నారు. తన వ్యక్తిగత న్యాయవాది సుధాకర్‌తో కలిసి గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వక్తులు పని నిమిత్తం విజయవాడ వచ్చి తన తమ్ముడైన ఇమ్మడిశెట్టి శ్రీనివాస్ దగ్గర హాస్టల్‌లో పని చేస్తూండగా కరోనా సమయంలో శ్రీనివాస్ చనిపోయాడని తెలిపారు. అది అదనుగా తీసుకోని.. గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే, తన తమ్ముడుతో వివాహం అయినట్టుగా తప్పుడు కధనాలు సృష్టించి, పోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన 540 గజాలు స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. డిస్ట్రిక్ట్ రిజిస్టార్ పటమట సబ్ రిజిస్టార్ సింగ్‌నగర్, ఎమ్మర్వోకు అర్జీలు పెట్టామని తెలిపారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైందని పేర్కొన్నారు. కొత్త సుమతి అనే మహిళ బెదిరింపులు, అక్రమాలపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.