మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటుతున్న చిన్నారులు -MLA బొండా ఉమ

Spread the love

మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటుతున్న చిన్నారులు -MLA బొండా ఉమ

చిన్నారులు ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకొని మన దేశానికి, మన రాష్ట్రనికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలి

నేటి సమాజంలో పిల్లలు, ముఖ్యంగా బాలికలు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మార్షల్ ఆర్ట్స్ వారికి ఆత్మరక్షణకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది, ఇది వారిలో భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నింపుతుంది, తల్లిదండ్రులు తమ పిల్లలను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి, ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, ఒక జీవన నైపుణ్యం -MLA బొండా ఉమ

ధి:-2-11-2025 ఆదివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గం లోని పైపుల రోడ్డు లోని రవీంద్రకన్వేషన్ లో జాతీయ స్థాయి పోటీలలో ఏడు రాష్టలనుంచి వచ్చిన తొమ్మిది వందల మంది పోటీదారులు ఆస్మా ( ఆల్ స్టయిల్ మార్షల్ ఆర్ట్స్ ) వారి నేత్రత్వంలో నిస్కిన్ మంక్స్ కుంగ్ ఫు మాష్టార్ దిపంగి శ్రీనివాస్ ఆద్వర్యంలో జాతీయ స్థాయి కరటే ట్వర్నమెంట్ జరిగింది…

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, విశిష్ట అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిధార్ధ బొండా రవితేజ పాల్గొనడం జరిగింది..

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- ఇలాంటి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం,పిల్లలందరూ కూడా చక్కగా గేమ్ ని నేర్చుకోవడం, ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొనడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, పిల్లలందరికీ కూడా ఏదో ఒక యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం, పేరెంట్సుగా మనం వాళ్ళు బిజీగా ఉంచాలి, వారికి మంచి విషయాలు నేర్పించడం మన బాధ్యత,
ఇలాంటి ఈవెంట్స్ అయితే శారీరక దృఢత్వం, మానసిక వికాసం రెండూ లభిస్తాయి అని…

నేటి తరం పిల్లలు వారిలో ఎంత ఉత్సాహం, క్రమశిక్షణ ఉన్నాయో అర్థమవుతుంది అని, మంచి యాక్టివ్ గా ఉండటమే కాకుండా, ఒక డిసిప్లిన్ అనేది వాళ్లకి అలవాటవుద్ది, ఇది వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎవరి మీద ప్రయోగించడానికో కాదు అని, ఇది వాళ్ళకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది, ముఖ్యంగా గర్ల్స్ కు ఆత్మరక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇది చాలా అవసరం అని, మహిళలు ఎక్కడికెళ్ళినా ధైర్యంగా ఉండటానికి సహాయపడుతుంది, గర్ల్స్ ఏ టైమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలాంటి విద్యలు నేర్చుకుంటే తల్లిదండ్రులకి దైర్యం గా ఉంటుంది అని…

విద్యార్థులకు, మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో ఎక్కడికైనా, ఎంత దూరమైనా ఎంత టైమ్‌ అయినా సరే, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు అని, తల్లిదండ్రులు ఈ శిక్షణ పై బాధ్యత తీసుకోవాలి, టీచర్స్, స్కూల్స్ వాళ్ళు కూడా దీన్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరముంది అని…

ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులను అభినంధించి, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహించాలని, పిల్లలందరిని కి శుభాకాంక్షలు తెలియజేసారు…

ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ G ప్రకాష్ రావు, G రుపాస్ పాల్, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ భాషా, తెలుగు యువత అధ్యక్షుడు బెజం జైపాల్, SC సెల్ అద్యక్షుడు వేల్పుల రాజేష్, 64వ డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్, వివిధ రాష్టలనుంచి వచ్చిన కుంగ్ ఫు కరటే మాష్టార్లు పాల్గొన్నారు

Loading