మళ్ళీ మోసపోవద్దు సుజనా ని గెలిపించండి ఎమ్మెస్ బెగ్ పిలుపు

0

 మళ్ళీ మోసపోవద్దు

సుజనా ని గెలిపించండి

ఎమ్మెస్ బెగ్ పిలుపు

ఐదేళ్లుగా జగన్ పాలన మాఫియా పాలనగా సాగిందని, అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని, ప్రజలు మళ్ళీ మోసపోవద్దు అని టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్మెస్ బెగ్ పిలుపు ఇచ్చారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాండ్ టైట్లింగ్ పేరుతో నల్ల చట్టాన్ని తీసుకు వచ్చి ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని జగన్ ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారని ఆయన కుట్రలను నిరోధించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)నీ ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని నీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సైకో జగన్ పాలన అంతం కావాలని, నల్ల చట్టం రద్దు కావాలంటే చంద్రబాబు నాయుడు సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ కార్పొరేటర్ య్యేదు పాటి రామయ్య అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని భారీ మెజార్టీ తో వెస్ట్ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) నీ గెలిపించాలని కోరారు.జగన్ కు బుద్ధి చెప్పే రోజుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మహిళలను మోసం చేసిన జగన్ నీ ఇంటికి పంపించేందుకు అంతా రెడీగా ఉన్నారని మాజీ కార్పొరేటర్ సుఖాసి సరిత మండిపడ్డారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version