భ్రమలలో చంద్రబాబు- వెల్లంపల్లి శ్రీనివాసరావు

0

 ది.16.05.2024

భ్రమలలో చంద్రబాబు- వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఈ-ఆఫీస్ మూసి వేయకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయడంపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ మద్యం.. ఇతరత్రా లెక్కలను తారుమారు చేయడానికి ఈ- ఆఫీస్ ముసి వేస్తున్నారని దానిని మూసి వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరాడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. జూన్ 4న తమ ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వమే మరోసారి రావాలని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. జూన్ 4న ఈ విషయం బహిర్గతం అవుతుందని అన్నారు. తమ ప్రభుత్వం ఏదో మోసాలు చేసినట్లుగా చంద్రబాబు భావిస్తున్నారని… తానే అధికారంలోకి వస్తానని కలలుకుంటున్నారని ఆయన అన్నారు. వచ్చేది వైయస్ జగన్ ప్రభుత్వమే అన్న విషయం చంద్రబాబుకు పూర్తిగా తెలుసని అందుకే తన నాయకులతో పలనాడులోనూ.. తిరుపతిలోనూ దాడులు చేయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన కల్లబొళ్ళి హామీలను ప్రజలు నమ్మలేదని..ప్రజలు విస్పష్టంగా జగన్ ప్రభుత్వాన్ని కోరుకున్నారన్నారు. జూన్ 4న విశాఖలో జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లంపల్లి చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version