భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

0
0

సింగపూర్
DAY-1

భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

• సమావేశంలో పాల్గొన్న మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టిజి భరత్ తో పాటు ఎపి ప్రభుత్వ అధికారులు
• వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్ , ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాలను వివరించిన భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే
• ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్,ఏవియేషన్, సెమి కండక్టర్స్,పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను వివరించిన హైకమిషనర్
• ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని తెలిపిన శిల్పక్ అంబులే
• భారత్ లో ప్రత్యేకించి ఏపిలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్న భారత హైకమిషనర్
• సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హైకమిషనర్
• గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామన్న సిఎం
• కొన్ని కారణాల వల్ల రాజధాని అమరావతి ప్రాజెక్టునుంచి సింగపూర్ బయటకు వెళ్లిందన్న సిఎం
• సింగపూర్ తో రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని…తన పర్యటనలో కొన్ని రికార్డులను సరి చేసేందుకు ప్రయత్నం చేస్తానన్న సిఎం
• ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలు, పెట్టబడులకు గల అవకాశాలను వివరించిన సిఎం
• గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్న సిఎం
• గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపిలో ఇప్పటికే పట్టాలెక్కాయని వివరించిన సిఎం
• ఇండియా క్వాంట్వం మిషన్ లో క్వాటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
• విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతుందని వివరించిన సిఎం
• డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపిన సిఎం
• ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలి…వాటికి ఎపి గేట్ వేగా ఉంటుంది అని చెప్పిన ముఖ్యమంత్రి
• సింగపూర్ లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ అని వివరించిన హై కమిషనర్..ఏపిలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించిన మంత్రి నారాయణ
• ఏపిలో పెట్టుబడులకు అవసరమై సహకారన్ని అందించాలని కోరిన సిఎం చంద్రబాబు
• విద్యా రంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తమ ఆలోచనలను వివరించిన మంత్రి లోకేష్
• ఎపిలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి వివరించి…ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామన్న మంత్రి లోకేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here