బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలా వెస్ట్ ఓటింగ్ జరగాలి వారి హక్కులు కాపాడుతా ఆరేకటికుల ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి

0

 బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలా వెస్ట్ ఓటింగ్ జరగాలివారి హక్కులు కాపాడుతా

ఆరేకటికుల ఆత్మీయ సమ్మేళనంలో  సుజనా చౌదరి 

ఈనెల 13వ తేదీన జరుగనున్న పోలింగ్ కు ఉదయం ఆరుగంటలకే బూత్ లకు వెళ్లి బాలేట్ బాక్సులు బ ద్దలయ్యేలా ఓటింగ్ జరగాలని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. ఓటింగ్ శాతం భారీగా పెరిగేలా ఓట్లు పొల్ కావాలని ఆకాంక్షించారు. అరేకటిక సామాజిక వర్గం ప్రజలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సుజనా పాల్గొని ప్రసంగించారు. మహిళలతో సహా భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఆరేకటిక లను ఉద్దేశించి సుజనా చౌదరి చేసిన ప్రసంగానికి వారు హర్షధ్వానాలు చేసారు. ఆయన ప్రసంగిస్తూ బావి తరాలకు విద్య,వైద్యం, ఉపాధి అవసరమని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పై ఉందని తనను భారీ మెజార్టీ తో గెలిపిస్తే అరె కటికుల చిరు డిమాండ్లను తప్పక  తీరుస్తానని ఆయన తెలిపారు. 12ఏళ్లుగా రాజ్య సభ సభ్యునిగా తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను అనేక  ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని సుజనా చౌదరి అన్నారు.

ఆ రె కటికుల సంఘం అధ్యక్షుడు సూర్య కళ్యాణం ఉమా మహేశ్వర రాసి మాట్లాడుతూ  తమ సమస్యల పట్ల గత ప్రభుత్వం   స్పందించ లేదని వేరే కులస్థుల తో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. సుజనా చౌదరి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం వల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచాలనీ నిర్ణయించు కున్నామని అన్నారు నాయకులు విజయ కుమార్, విష్ణు, భక్తవత్సలం, సాయి ప్రసాద్ తదితరులు కూడా పాల్గొని ప్రసంగించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version