బోడె ప్రసాద్ తో పాటుగా 12 మంది టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసు కొట్టివేత

0

 గన్నవరం

26.07.2024

బోడె ప్రసాద్ తో పాటుగా 12 మంది టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసు కొట్టివేత

తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసును కోర్టు కొట్టివేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లా, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై అప్పటి సీఎం జగన్ రెడ్డి ఆదేశానుసారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించడంతో పాటుగా విచక్షణరహితంగా పలు కార్లను, కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అప్పటి పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి, బోడె ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వైసీపీ మూకలు చేసిన దాడులను విలేఖరుల సమావేశం ద్వారా జగన్ రెడ్డి అరాచకాలను, వంశీ అనుచరుల దాడులను ఖండించారు. దీనిపై బోడె ప్రసాద్ తో పాటుగా టీడీపీ నాయకులు గరిమెళ్ళ నరేంద్ర చౌదరి, పుట్టా సురేష్, పోట్లూరి వెంకట సుధీర్, పెందుర్తి శ్రీకాంత్, కంచర్ల సూర్యప్రకాష్, యార్లగడ్డ మోహన్ కృష్ణా, అట్లూరి శ్రీనివాస్, కొలుసు వరప్రసాద్, మేకల కోటేశ్వరరావు, పిడికిటి సతీష్ బాబు, కుందేటి రఘుబాబులపై గన్నవరం పోలీస్ స్టేషన్లో పోలీసులు అక్రమ కేసును నమోదు చేశారు. అనంతరం 12మందిపై గన్నవరం జ్యూడిషీయల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా, సాక్షులను కోర్టు విచారించింది. నేరం రుజువుకాకపోవడంతో న్యాయమూర్తి సిహెచ్ శ్రీనివాస్ బాబు కేసును కొట్టి వేస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం తమ వాదనలను బలంగా వినిపించిన టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు సుంకర వెంకట సురేష్, శొంఠి వీరబాబులకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version