బిజెపి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ

0

 విజయవాడ పశ్చిమ 

*సుజనా చౌదరి ప్రెస్ మీట్

*

 అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం అని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే నాలుగు నుండి ఐదు శాతం వరకు ఓటింగ్ పెరిగిందని పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని ఆయన వివరించారు.  మంగళవారం పశ్చిమ బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉండడం వలనే ఓటింగ్ పర్సెంట్ పెరిగిందని అన్నారు పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని పశ్చిమ లో ప్రజలు చైతన్యవంతం చేసేందుకు చేసిన ప్రయత్నం సఫలం అయిందని ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేశారని భావిస్తున్న అన్నారు. నాలుగవ తేదీ ఫలితాలు అనంతరం పశ్చిమ ప్రజల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తానని తెలిపారు.

 ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇస్తున్న తీర్పు అని తెలిపారు, పశ్చిమ లో కమలం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 కొణిజేటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని చూస్తారని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version