బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు క‌లిసిక‌ట్టుగా కృషిచేద్దాం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

0

ఎన్టీఆర్ జిల్లా, 06.06.2025 బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు క‌లిసిక‌ట్టుగా కృషిచేద్దాం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.స్థానిక కలెక్టరేట్ చాంబర్లో శుక్రవారం కార్మిక, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (సిఆర్ఏఎఫ్) ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీ శ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూత‌ట బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా ఈనెల 30వ తేదీ వరకు కార్మిక, పోలీస్, స్వచ్ఛంద సంస్థలు ,రెవెన్యూ, శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించాలన్నారు. బాల, కౌమార కార్మిక నిషేధం, నియంత్రణ చట్టం మేరకు 14 సంవత్సరాల లోపు బాలలను, 14 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారిని ప్రమాదకర పనుల్లో పెట్టడం నేరమన్నారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. బాలలను, కౌమార బాలలను, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే ఫోన్:100,1098, 1800 102 7222 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప కార్మిక కమిషనర్ సి.హెచ్.ఆశారాణి, ఐసిడియస్ పిడి డి. శ్రీలక్ష్మీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ యం.రాజేశ్వరరావు, వాసవ్య మహిళామండలి డా. వి.కీర్తి, సి ఆర్ ఏ ఎఫ్ ప్రతినిధి ప్రభాకర్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సభ్యులు ఎ.రమేష్, సహాయ కార్మిక అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version