ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర సదస్సు ,నరసరావు పేటలో ఘనంగా నిర్వహణ

0

ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర సదస్సు ,నరసరావు పేటలో ఘనంగా నిర్వహణ
తిరుపతి

ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు అమరావతి కి చెందిన ప్రత్తిపాటి.చంద్ర మోహన్ , నరసరావు పేట ఏం ఎల్ ఏ సి.హెచ్.అరవింద్ బాబు విశిష్ట అతిథిలు గా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పల్నాడుజిల్లా కు చెందిన మట్టా.ప్రసాద్ సభా అధ్యక్షులుగా,రాయలసీమ కు చెందిన నేషనల్ జాయింట్ సెక్రటరీ కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ గౌరవ అతిథిగా నరసరావు పేట లో ఆదివారం జరిగిన రాష్ట్ర సదస్సుకు పలు జిల్లాల నుంచి వచ్చిన ఎఫ్ ఆర్ టి ఐ నాయకత్వాలు,ఆర్ టి ఐ అవేర్నెస్ కార్యకర్తలు,అభిమానులతో ఇస్సప్పాలెం ,మహంకాళి దేవస్థానప్రాంగణంలో, వాసవి ఆర్యవైశ్య కళ్యాణ్ మండపంలో సమావేశం ఘనంగా నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ ల జిల్లా అధ్యక్షులు సత్య నారాయణ, కుమార్, రామకృష్ణ,మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు, విద్యా వేత్త.శేషగిరి రావు,వివిధ రంగాల నిపుణులు కూడా విశిష్ట అతిథిలుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ విద్యా ప్రదాత,రెడ్ క్రాస్ సంస్థ సీనియర్ సభ్యులు,సామాజిక వేత్త, ఐన బత్తుల.మురళీ ను ఎఫ్ ఆర్ టి ఐ రాష్ట్ర సలహాదారుగా సభా వేదికగా ప్రకటించటం, ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ శాఖ సహాయ కార్యదర్శి అజయ్ ప్రసన్న ,వారి తో ప్రమాణ స్వీకారోత్సవం ఘావించటం జరిగింది.ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ టీ ఐ అన్ని శాఖల నాయకత్వాలు, ఆర్య వైశ్య వాసవి మండపం కమిటీ సభ్యులు,లోకల్ ఏం ఎల్ ఎ గారు,సభకు విచ్చేసిన విశిష్ట అతిథిలు అందరి చేతుల మీదుగా బత్తుల.మురళీని ఘనంగా సత్క రించారు.ఈ సభలో మేధావులు,వక్తలు ఆర్ టి ఐ, లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ మీద కార్యకర్తలకు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న సామాన్య ప్రజలు ను,మహిళా మూర్తులు, యువత ను ఉద్దేశించి అవగాహన కార్యక్రమంనిర్వహించారు.ఈ సభావేదికగానే,ఫోరం ఫర్ ఆర్టీఐ తరపున నేషనల్ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ ను తిరుపతి జిల్లా కు చెందిన సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ కు,జాతీయ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లోకల్ MLA ,ఎఫ్ ఆర్ టి ఐ రాష్ట సలహాదారు బత్తుల.మురళీ మరియు సభా వేదికను అలంకరించిన విశిష్ట అతిథిలు, వివిధ నాయకత్వాలు చేతుల మీదుగా షీల్డ్ ను ప్రదానం చేసి అభినందించడం జరిగింది. జిల్లా బెస్ట్ ప్రెసిడెంట్ గా, కర్నూలు కు చెందిన వై.ఎల్లప్పకు షీల్డ్ అందించి సన్మానించడం జరిగింది. ఈ సభలో ఎఫ్ ఆర్ టి ఐ ఫౌండర్ కంనేషనల్ ప్రెసిడెంట్ పి.చంద్ర మోహన్ ను, జాతీయ ఉపాధ్యక్షులు ఏం.ప్రసాద్ ను, జాతీయ, రాష్ట్ర శాఖ ల నాయకత్వాలు విక్టర్ పాల్ ను, యేసుదాసు ను, రమణ ను,డాక్టర్ అశోక్ ను,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అనిత ను, మహిళా నాయకత్వాలు ఝాన్సీ, గౌరీ పూర్ణిమ, చానా,వాణి ,లక్ష్మీ, అమృత మొదలైన వారిని,బహుజన టైమ్స్ పేపర్, న్యూస్ చానల్స్ ఏండి, ఎడిటర్ దుర్గా ప్రసాద్ ను, ఛాన్విక జ్యోతి న్యూస్ పేపర్ ఎడిటర్ ఉదయ్ కుమార్ ను, ఎఫ్ ఆర్ ఎఫ్ ఆర్ టి ఐ వివిధ జిల్లాల ప్రముఖ లీడర్షిప్స్, నిబద్ధత గల ఆక్టివ్ మెంబెర్స్ కు, MLA అరవింద్ బాబు, బత్తుల.మురళీ, కమిటీ సభ్యులు,వేదికను అలంకరించిన అతిథులు చేతుల మీదుగా,షీల్డ్స్ ప్రెసెంట్ చేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా చేరిన పలువురు ఆక్టివ్ మెంబెర్స్ అందరికీ ఐడి కార్డు లు అందచేయటం జరిగింది.ప్రజా సమస్యలు, ఎఫ్ ఆర్ టి ఐ విధి విధానాల మీద ఆక్టివ్ గా లేని కొన్ని జిల్లాల వారి స్థానంలో నూతన అధ్యక్షులను,కార్యదర్శులను,ఉపాధ్యక్షులు ను ప్రకటించటం జరిగింది.పురుషులతో పాటు, మహిళా ఆక్టివ్ సభ్యులు, కమిటీ మెంబెర్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొనటం విశేషం.బోజన విరామం అనంతరం ఫోరం ఫర్ ఆర్ టి ఐ జాతీయ,రాష్ట్ర, జిల్లా, మండల ,పట్టణ నాయకత్వాలు,ముఖ్య ఆక్టివ్ మెంబెర్స్ తో అంతర్గత సమావేశం నిర్వహించి, చివరగా ఓట్ ఆఫ్ థాంక్స్ తో రాష్ట్ర సదస్సును దిగ్విజయంగా ముగించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version