ప్రజాస్వామ్యానికి చీకటి రోజును) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0

విజయవాడ, తేదీ: 25.06.2025

         అంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాషా  సాంస్కృతిక శాఖ మరియు సంస్కృతి సమితి మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన అత్యయక పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా (ప్రజాస్వామ్యానికి చీకటి రోజును) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. 

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎమర్జెన్సీ అని అలాంటి ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం నిలిచిందన్నారు. గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. 1975 జూన్ 25 న ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు కావడంతో నాటి పరిస్థితులను మంత్రి తెలియజేశారు. ఎమర్జెన్సీ కాలం భారత రాజ్యాంగ అమలుకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. నాడు ఎమర్జెన్సీని ఎదుర్కొని, నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో బలమైన ప్రజా ఉద్యమం నడిచిందన్నారు. భవిష్యత్తు ఏ రకంగా ఉండకూడదో అనే అంశంపై ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే సంవిధాన్ హత్యా దివాస్ అన్నారు. నాటి ప్రధాన మంత్రి ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణాలు ఏమైనప్పటికీ అధికారకాంక్షతో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా పక్కనబెట్టి తానే అధినాయకురాలనే భావనతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కారణమయ్యారన్నారు. నాడు దుర్మార్గ విధానాలు అవలంభించి ప్రతి పక్ష నేతల గొంతు నులిమేశారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య విధానాలతో రాష్ట్రంలో ముందుకు వెళ్లాలన్న సత్సంకల్పంతో కూటమిగా ఏర్పడేందుకు చారిత్రాత్మక నిర్ణయానికి బీజం పడిందన్నారు.. ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తూ, ప్రజాస్వామ్య విధానానికి నిలువెత్తు నిదర్శనంగా సీఎం చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని తెలిపారు. తాను సీఎం చంద్రబాబు నాయుడు ను గడిచిన సంవత్సరకాలంగా 26 కేబినెట్ సమావేశాలు, అనేక ఎస్ఐపీబీ సమావేశాల్లో దగ్గరగా చూశానని, ఆయన నాయకత్వ పటిమ ఏంటో అర్థమైందన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజాస్వామ్యపాలను ఎలా చేయాలో తరుచూ దిశానిర్దేశం చేస్తారన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎవ్వరికీ లేని రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆ రాజ్యాంగం వల్లే మనం ఏకత్వంతో చెక్కు చెదరకుండా ప్రజాస్వామ్యాన్ని నేటికీ కాపాడు కుంటున్నామన్నారు. దేశంలో ఎమెర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయన్నారు. అప్పుడు దేశ ప్రజలకు తగిలిన గాయాలను గుర్తించుకుని ముందు తరాలు వాటి గురించి తెలుసుకునేలా అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎమెర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛను హరించి దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది నాయకులను జైళ్లల్లో నిర్భందించారన్నారు.. జనాభా నియంత్రణ కోసం మహిళలను, పురుషులను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. స్వతంత్ర్య భారత దేశంలో 1975-77 కాలం చీకటి రోజులన్నారు. అంతేకాకుండా 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో సవరణలు చేసి రాజ్యాంగ స్వరూపాన్ని మార్చారన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల విలువలేని నాయకులు మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాల్సింది ప్రజలేనన్నారు.

పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ 1975-77 ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. అలాంటి ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తులకు వారసులుగా మాలాంటి వారు రావడం గర్వంగా ఉందన్నారు.

శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆశీస్సులతోనే దేశం ముందుకు వెళ్లుతుందన్నారు. 1975-77 సంవత్సరాల్లో చీకటి రోజులుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ డా.బీఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతీయ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. భారతదేశం చుట్టుపక్కల దేశాలు ఎన్నో ముక్కచెక్కలు అయినా భారతదేశం చెక్కుచెదరకుండా ఉండటంలో రాజ్యాంగం ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.

కార్యక్రమంలో టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సాంస్కృతిక శాఖకు చెందిన మల్లిఖార్జున్, డాక్టర్ సమరం, సామాజికవేత్త గోళ్ల నారాయణరావు తదితరలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version