విజయవాడ నగరపాలక సంస్థ
18-03-2025
ప్రజలకు ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడండి
*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
ప్రజలకు ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలి అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లో సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 2 వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి తో కలిసి బెత్లెహేమ్ నగర్, మాచవరం వద్దగల యర్రం వారి వీధి ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి తో పర్యటించి ఆ డివిజన్లో గల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కొండ ప్రాంతాలలో క్వారీలలో నీటి నిల్వలు ఎప్పటికప్పుడు తీసివేయాలని, క్వారీ పిట్లకు మూతలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న బోర్డింగ్ స్కూల్ వద్ద డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, దిగువ ప్రాంతమైన కుమ్మరి బజార్లో డ్రైనేజీ నీరు చేరుకోకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోరగా అధికారులు తక్షణమే ప్రణాళికను సిద్ధం చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
కొండ ప్రాంతాల్లో ప్రజలకు రానున్న వేసవికాలంలో త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కొండ ప్రాంతంలో బూస్టర్ పంపులు అన్నిటినీ పరిశీలించి మరమ్మతులో ఉన్నవన్నీ రిపేరు చేయించి వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొక్వాల్ , జోనల్ కమిషనర్ కె షమ్మీ, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.