విజయవాడ
పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సిపి నాయకులు .
EVM లను నమ్ముకున్న వారికి అంబేద్కర్ పై, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన నమ్మకం ఉంటుందా
స్వరాజ్య మైదానం వారసత్వ సంపద .అటువంటి వారసత్వ సంపదను కాపాడింది జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాలని చూసింది చంద్రబాబు నాయుడు
స్వరాజ్యం మైదానాన్ని చైనా కంపెనీలకు సుజనా చౌదరికి కట్ట బెట్టాలని చంద్రబాబునాయుడు 2017 లోనే ప్రయత్నం చేశారు కానీ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు వ్యతిరేకత రావడం వలన కట్టబెట్టే ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా దోషుల్ని పట్టుకోకుండా కనీసం ఖండించలేదంటే వారికి ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన నమ్మకం లేదని అర్థం.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి కూతవెటు దూరంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిగిన మీరు స్పందించలేదంటే చాలామందికి ఆశ్చర్యం కలిగింది మీకు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని ఈవీఎం నమ్ముకున్నారని అనుమానం కలుగుతుంది.