పేదల కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ 16,17 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
ఆత్మీయ పలకరింపుల మధ్య వార్డు పర్యటనలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఎమ్మెల్యే రాము… కూటమినేతలు
గుడివాడ జూలై 18: రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
గుడివాడ పట్టణంలోని 16,17 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని, ఆత్మీయ పలకరింపుల మధ్య ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం నిర్వహించారు.
పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఉన్నాయా అని ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు.ఏడాది కూటమి పాలనలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందచేశారు.పర్యటనలో భాగంగా 17వ వార్డులోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యే రాము,కూటమి నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని స్థానికులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్న ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లుల ఖాతాలో నగదు వేసి ఆదుకున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తున్నారన్నారు. రాబోవు నాలుగేళ్లలో గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వాటి అమలు దిశగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, సీనియర్ టిడిపి నాయకులు లింగం ప్రసాద్, పండ్రాజు సాంబశివరావు, గోర్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, గోకవరవు సునీల్ కుమార్, ముళ్ళపూడి రమేష్ చౌదరి, గడియాల గణేష్, వేశపోగు ఇమ్మానుయేలు, నేరసు కాశి, దేవరపల్లి కోటి, ఆదినారాయణ, లోయ విజయ్, అజయ్ రానా, నిరంజన్, వర్రి నాగరాజు, మానం రమేష్, గుదే రమణ, అల్లాడ శ్రీను, సయ్యద్ జబీన్, MD రఫీ, దొండపాటి మహేష్, తులసి రాణి, మల్లికా బేగం…. 16వ వార్డు టిడిపి నాయకులు యార్లగడ్డ సుధారాణి, కనకారావు, బూసి భాస్కరరావు, ద్రోణాదుల కుమార్, ముక్కు హరి, తమ్మిశెట్టి గోపి, చల్ల బాలాజీ, అనపర్తి హిమగిరి, చల్లా వెంకటేశ్వరమ్మ…. 17వ వార్డు టిడిపి నాయకులు మరీదు రోహిణి కుమార్, మద్దుకూరి ప్రభాకర్, ముక్కుడు ఉమా, మరీదు కరుణ, మెరుగుమాల రంగారావు, సొంటి రామకృష్ణ, షేక్ బాజీ, షాకీర్, పట్టణ పరిధిలోని పలువురు టిడిపి నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.