జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు.
2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని అన్నారు. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. కాగా గత ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి, రెండు చోట్లా పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Spread the love మంగళగిరి 23.07.2024. బాధితులకు బాసటగా సమస్యలతో వచ్చిన వారికి మంత్రి కొల్లు రవీంద్ర తక్షణ పరిష్కారం తప్పుడు కేసులు, సమస్యలపై అధికారులకు ఫోన్ వెల్లువలా తరలి వచ్చిన వైసీపీ అరాచక పాలనా […]
Spread the love విజయవాడ నగరపాలక సంస్థ 13-08-2024 త్రాగునీటి సమస్యని 24 గంటల్లో పరిష్కరించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు కండ్రిక శివారు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను […]
Spread the love సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కూటమి శ్రేణులు పరదాల పాలనకు స్వస్తి.. రాష్ట్రంలో మార్పు మొదలైంది ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ‘తొలి సంతకాల’తో సంబరం […]