ఏపీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పాతవారు, కొత్తవారు అందరూ బీజేపీ వారేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మరిన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. బీజేపీకి 11వ ఎమ్మెల్యే సీటు వస్తుందని… ఆ సీటు ఎక్కడి నుంచి అనేది నిర్ణయిస్తామని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపైనే తమ ఆలోచన అని అన్నారు.
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు భవిష్యత్తును పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలోకి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించామని ఆరోపించడం సరికాదని అన్నారు. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే టికెట్లను కేటాయించామే తప్ప… కావాలని ఎవరినీ పక్కన పెట్టలేదని చెప్పారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలను బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరం గౌరవిస్తున్నామని తెలిపారు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ మరో ఎమ్మెల్సీ సీటును కోరుతోంది.
Spread the love మహిళలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు దిత్య హృదయం ప్రతినిధిప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని అధికారంలోకి వచ్చిన […]
Spread the love“రైజ్” ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తల ఆలోచనలకు కార్యరూపం.. మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ద్వారా కార్యరూపం ఇస్తున్నామని.. జిల్లాలో 5 వేల […]