పశ్చిమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసి రండి ..అభివృద్ధి పనుల శంకుస్థాపనలోఎమ్మెల్యే సుజనా చౌదరి..

0

పశ్చిమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసి రండి ..
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి..

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు .
పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి మరిన్ని అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే సుజనా కోరారు.
సోమవారం 56 వ డివిజన్ పాత రాజా రాజేశ్వరి పేట లోని జేపీ అపార్ట్మెంట్ డీ బ్లాక్ నుండి స్కై మెడికల్ అండ్ ఫాన్సీ షాప్ వరకు రూ 49.95 లక్షల నిధులతో 690 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లైన్ నిర్మాణ పనులను , మహంకాలమ్మ టెంపుల్ జంక్షన్ నుండి రైల్వే గేటు వరకు పెవర్ బ్లాక్స్ తో రహదారి విస్తరణకు
రూ 48 .23 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ముందుగా ఎర్ర కట్ట డౌన్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూటమి నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జేపీ అపార్ట్మెంట్ నివాసితులకు ఇచ్చిన హామీ మేరకు రోడ్లు , డ్రైనేజీల ను నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే అప్రోచ్ రోడ్, వాటర్ ట్యాంక్ నిర్మాణం,పార్క్ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు .
పశ్చిమ లోని మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నానన్నారు.
ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం అందరం కలిసి సమిష్టిగా ప్రజాసేవలో భాగస్వామ్యులం కావాలన్నారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి పని చేస్తున్నామని తెలిపారు..
వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధికి సహకరించాలని కోరారు .
అభివృద్ధి విషయం లో రాజకీయాలకతీతంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు.
ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.
బుడమేరు ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమ ప్రజలకు ఎల్లవేళలా ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఈ ఈ జే శ్రీనివాస్, డీ ఈ మాధవి,
ఏ ఈ జాస్మిన్,కార్పొరేటర్లు బుల్లా విజయ్, యలకల చలపతిరావు, టీడీపీ అధికార ప్రతినిధులు నాగుల్ మీరా, సయ్యద్ రఫీ, కూటమి నేతలు కోగంటి రామారావు, దనేకుల సుబ్బారావు, వరప్రసాద్, పెద్ది శ్యామ్ సుందర్,రౌతు వాసు, నున్నా కృష్ణ, దేవకి, రెడ్డిపల్లి రాజు, పైలా సురేష్, జేపీ అపార్ట్మెంట్ వాసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version