తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. గత నెలలో భీమవరంకు వచ్చినప్పుడు తనపై కోపం లేదని అన్నారని… ఇప్పుడేమో తనను రౌడీ అంటున్నారని విమర్శించారు. భీమవరంలో స్థలం కొందామనుకుంటే తాను అడ్డుకున్నానని అంటున్నారని… ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఉన్నారని పవన్ అన్నారని… భీమవరంలో అటువంటివారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తన మీద పవన్ కు ఎందుకంత అసూయ అనేది తనను అర్థం కావడం లేదని చెప్పారు. నీకు స్థలం కావాలంటే నాకున్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెపితే అక్కడ ఇస్తానని తెలిపారు.
జనసేన కార్యకర్తలు తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ డైరెక్ట్ గా చెపుతున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఆయనను ఇష్టపడే వ్యక్తులకు ఆయనతో కలిసి సెల్ఫీ దిగే అవకాశం కూడా ఉండదని చెప్పారు. పవన్ నిజ స్వరూపం తెలియని అభిమానులు సీఎం సీఎం అంటుంటారని… నువ్వు మాత్రం 21 సీట్లకే పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావని ఎద్దేవా చేశారు.
చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు అసలు పోలికే లేదని శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారని… పవన్ మాదిరి విమర్శలు చేయలేక రాజకీయాల నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని దుయ్యబట్టారు. 2019లో ఓడిపోయిన తర్వాత మళ్లీ భీమవరం ముఖమే చూడలేదని… కరోనా టైమ్ లో కూడా ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తనను రౌడీ అని పవన్ అంటున్నారని… తన మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని చెప్పారు. తన గురించి భీమవరం ప్రజలను అడిగితే చెపుతారని అన్నారు.
Spread the loveభారత స్వాతంత్ర్య సమరయోధుడు,దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ పరిపుష్టికి విశేష కృషి చేసిన మహనీయుడు,భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహా దేశభక్తుడి సేవలను […]
Spread the love పశ్చిమను బిల్డప్ చేస్తా నిర్మాణదారుల సమస్యలను పరిష్కరిస్తా సుజనా చౌదరి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి భవన నిర్మాణ కార్మికులకు బిల్డర్లకు అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా […]
Spread the loveచేవెళ్ల బస్సు ప్రమాదంలో టీచర్ నరకయాతన టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోకి.. నడుములోతు కంకరలో ఇరుక్కున్న టీచర్ జేసీబీతో వెలికి తీసి ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ టీమ్ చేవెళ్లలో ఈ […]