31.07.2025, విజయవాడ.
పదవి విరమణ చేపట్టిన సమాచార శాఖ పబ్లిసిటీ అసిస్టెంట్ చోరగుడి జాక్సన్ బాబు.
రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన చోరగుడి జాక్సన్ బాబు యొక్క వీడ్కోలు సమావేశాన్ని రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల కమిషనర్ కార్యాలయంలో గురువారం నిర్వహించడం జరిగింది. 30 సంవత్సరాలు విధిగా తన భాద్యతలను నిర్వర్తిస్తూ తనదైన శైలిలో సేవలు అందించిన చోరగుడి జాక్సన్ బాబుకు పదవి విరమణ శుభాకాంక్షలను తెలియజేస్తూ తను సేవలకు గుర్తుగా సమాచార శాఖ ఉద్యోగులంతా కలిసి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్ .స్వర్ణలత మాట్లాడుతూ, జాక్సన్ బాబు దాదాపు 30 సంవత్సరాల పాటు నిర్విరామంగా పుబ్లిసిటీ అసిస్టెంట్ గా సేవలు అందించారని, ఉద్యోగ రిత్యా ఎన్నో రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిన సందర్భంలో కూడా సంయమనం కోల్పోకుండా భాద్యతలు నిర్వర్తించారని తెలియజేస్తూ పదివి విరమణ చేపడుతున్న జాక్సన్ బాబుకి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ జాక్సన్ బాబుకు పదవి విరమణ శుభాకాంక్షలను తెలియచేసారు. పబ్లిసిటీ అసిస్టెంట్ గా జాక్సన్ బాబు అందించిన సేవలు ఏంటో గొప్పవని, టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో లైని రోజుల్లో ప్రభుత్వం తమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పబ్లిసిటీ అసిస్టెంట్ లను విరివిగా ఉపయోగించుకునే వారని, అటువంటి సమయంతో సంబంధం లేకుండా పనిచేయాల్సి వచ్చిన జాక్సన్ బాబు ఎంతో ఓర్పుగా చేసేవారని, పుష్కరాలు, వరదలు వంటి అనేక సందర్భాల్లో కలిసి పనిచేశామని ఇక పైన ఆయన సేవలు దూరమవడం బాధాకరం అన్నారు.
అనంతరం రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ సహాయ సంచాలకులు ఎమ్. భాస్కర్ నారాయణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల పాటు తానూ జాక్సన్ బాబు కలసి పని చేశామని, తన పనిని ఎంతో ఓర్పుగా నిర్వర్తిస్తారని, చేసే పనిలో ఎటువంటి లోపాలకు చోటివ్వకుండా ఎంతో సహకారం అందించేవారని తెలుపుతూ జాక్సన్ బాబుకు పదవి విరమణ శుభాకాంక్షలను తెలియచేసారు.
ఈ పదవి విరమణ కార్యక్రమానికి రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరామరాజు గౌడ్, నారాయణ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ సుదర్శన్, ఎన్ టీ ఆర్ జిల్లా సమచార శాఖ డిఐపిఆర్ఓ రమణ, డిపిఆర్ఓ మోహన్, డివిజనల్ పిఆర్ఓ రవి, ఎవిఎస్ ప్రసాద్ మరియు తదితర సిబ్బంది హాజరయ్యారు.